Begin typing your search above and press return to search.
టెకీలకు సవాలు విసిరిన ట్విటర్.. సత్తా చూపాలే కానీ లక్షల్లో ప్రైజ్ మనీ
By: Tupaki Desk | 4 Aug 2021 4:38 AM GMTసోషల్ మీడియా అన్నంతనే గుర్తుకు వచ్చే మొదటి రెండింటిలో ట్విటర్ ఒకటి. నిజానికి ఈ సామాజిక వేదిక కానీ లేకపోతే ప్రపంచ వ్యాప్తంగా పలు పరిణామాలు చోటు చేసుకునేవే కావేమో? అంతేకాదు.. పలువురు రాజకీయ నేతలకు కొత్త జన్మను ఇచ్చిన ఈ ఫ్లాట్ ఫాం.. మరికొందరికి తగిలిన షాక్ లు అన్ని ఇన్ని కావు. పదునైన పదాల్ని షేర్ చేసి.. కొత్త ఇమేజ్ తెచ్చుకున్న వారు కోట్లల్లోనే ఉంటారు. అంతేకాదు.. ప్రపంచంలో చోటు చేసుకునే ఎన్నో రాజకీయ.. సామాజిక పరిణామాల్లో ట్విటర్ పాత్ర ఎంతో కీలకమని చెప్పక తప్పుదు. అలాంటి ఈ సంస్థ ఈ మధ్యనే ఒక భారీ సవాలును విసిరింది.
ట్విటర్ లో యూజర్ల డేటాకు సంబంధించిన సెక్యురిటీ మీద ఛాలెంజ్ విసిరిన ఈ సంస్థ.. తనలోని లోపాల్ని ఎత్తి చూపిస్తే భారీ నజనారాను అందిస్తామని స్పష్టం చేసింది. సాధారణంగా టెక్నాలజీ కంపెనీలు ఈ తరహా సవాలును విసురుతుంటాయి. ట్విటర్ విషయానికి వస్తే తమ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అల్గారిథంలో బగ్స్ ఏమైనా ఉన్నట్లు గుర్తిస్తే.. లక్షల్లో నజరానాను ఇస్తామని పేర్కొంది. బిగ్ బౌంటీ ప్రోగ్రాంను ట్విటర్ ప్రవేశ పెట్టటం ఇదే తొలిసారి.
మెషిన్ లెర్నింగ్ అల్గారిథం మోడళ్లలోని లోపాలను కనిపెట్టటం చాలా కష్టమని.. హ్యాకర్లకు తమ సవాలుగా ట్విటర్ పేర్కొంది. దీన్ని స్వీకరించి లోపాల్ని వెతికి చూపితే భారీ నజరానా ఖాయమని పేర్కొంది. తమ సవాలుకు తగ్గట్లే కోడ్ ను ఛాలెంజ్ స్వీకరించే వారికోసం అందుబాటులో ఉంచిన సంస్థ.. లోపాల్ని గుర్తిస్తే.. మొదటి బహుమతి కింద రూ.2.5లక్షలు ఇవ్వనుంది. యూజర్లను హ్యాకర్ల నుంచి కాపాడటానికే ఈ సవాలుగా చెబుతున్నారు. ఈ సవాలును స్వీకరించిన వారిలో విజేతలుగా నిలిచిన వారిని ఆగస్టు 8న నిర్వహించే డేఫ్ కాన్ ఏఐ విలేజ్ లో ట్విటర్ హోస్టు చేయనున్న వర్కుషాపులో ప్రకటిస్తారని చెబుతున్నారు. టెకీలకు చేతినిండా పని చెప్పిన ట్విటర్ కోరినట్లే.. ఏమేం లోపాల్ని గుర్తిస్తారో చూడాలి.