Begin typing your search above and press return to search.
గ్వాలియర్ మరో పఠాన్ కోట్ అయ్యేదా?
By: Tupaki Desk | 9 Feb 2016 11:06 AM GMTపఠాన్ కోట్ వైమానిక స్థావరంపై దాడిని ఇంకా మర్చిపోకముందే అలాంటిదే మరో ప్రమాదం తృటిలో తప్పింది. పఠాన్ కోట్ లో ఉగ్రవాదులు చొరబడినట్లే మరో వైమానిక స్థావరంలోనూ గుర్తు తెలియని వ్యక్తులు చొరబడే ప్రయత్నం చేశారు.
గ్వాలియర్ లోని మహారాజ్ పూర్ వైమానిక స్థావరంలోనికి అక్రమంగా ప్రవేశించేందుకు ప్రయత్నించిన ఇద్దరిని వైమానిక దళ అధికారులు అదుపులోనికి తీసుకుని పోలీసులకు అప్పగించారు. వారిరువురూ కూడా నకిలీ గుర్తింపు కార్డులతో వైమానిక స్థవరంలోనికి ప్రవేశించడానికి ప్రయత్నించారని వైమానిక దళ అధికారులు తెలిపారు. పఠాన్ కోట్ వైమానిక స్థావరంపై ఉగ్రదాడి అనంతరం దేశంలోని అన్ని వైమానిక స్థావరాల వద్ద భద్రతను పెంచిన సంగతి తెలిసిందే. కాగా గ్వాలియర్ వైమానిక స్థావరంలోనికి ప్రవేశించడానికి ప్రయత్నించి పట్టుబడిన ఇరువురినీ పోలీసులు విచారిస్తున్నారు.
వారికి ఉగ్రవాద సంబంధాలేమైనా ఉన్నాయా... లేదంటే ఇంకేదైనా పనులపై వచ్చినవారా అన్నది తేలాల్సి ఉంది. పఠాన్ కోట్ లో పలువురు సైనికులను ఉగ్రవాదులు పొట్టనపెట్టుకోవడం.. అక్కడి ఆపరేషన్ సుదీర్ఘంగా సాగిన నేపథ్యంలో అన్ని వైమానికస్థావరాల్లో భద్రత పెంచారు. ఆ క్రమంలోనే వీరిద్దరూ చిక్కారు.