Begin typing your search above and press return to search.
ముఖేశ్ ఇంట్లో ఇప్పుడు ఇద్దరు భరతనాట్య కళాకారులు.. ఎవరంటే..?
By: Tupaki Desk | 6 Jun 2022 6:31 AM GMTప్రపంచంలో అంబానీ ఫ్యామిలీ గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. కుభేరుల్లో ఒకరైనా ముఖేశ్ అంబానీ పట్టిందల్లా బంగారమే అవుతోంది. రిలయన్స్ అధినేతగా బాధ్యతలు తీసుకున్న ఆయన ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో సంస్థలు ప్రారంభించారు. అయితే వ్యాపారంతో ఎంత బిజీ ఉన్నా ఆయన ఫ్యామిలీ గురించి ఫస్ట్ ఫ్రిఫరెన్స్ ఇస్తూ ఉంటారు. మఖేశ్, నీతా అంబానికి ఇద్దరు కుమారులున్న విషయం తెలుసు. వారిలో పెద్ద కుమారుడు ఆకాశ్.. చిన్నకొడుకు అనంత్.. ఒక కూతురు ఇషా ఉన్నారు.
పెద్ద కుమారుడు ఆకాశ్ కు శ్లోకా మెహతాను పెళ్లి చేసుకున్నారు. చిన్న కుమారుడు అనంత్ కు రాధికా మర్చంట్ అనే అమ్మాయితో వివాహ నిశ్చితార్థం జరిగింది. తాజగా రాధికా మర్చంట్ కు చెందిన ఓ వీడియో వైరల్ అవుతోంది. ఆమె ఇటీవల చేసిన భరతనాట్యం పలువురిని ఆకట్టుకుంది. వ్యాపారంలోనే కాలకుండా సాంస్కృతిక విషయంలోనూ అంబానీ ఫ్యామిలీ ముందుందని పలువురు చర్చించుకోవడం ప్రారంభించారు.
దేశ ఆర్థిక రాజధాని ముంబైలో ఆదివారం ఓ సాంస్కృతిక కార్యక్రమం నిర్వహించారు. ఈ వేదికపై ముఖేశ్ అంబానీకి కాబోయే కోడలు, చిన్న కుమారుడు అనంత్ ను పెళ్లి చేసుకోబోయే రాధికా మర్చంట్ భరతనాట్యం చేశారు. నగరంలోని జియో వరల్డ్ సెంటర్లోని గ్రాండ్ థియేటర్లో జరిగిన ఈ కార్యక్రమానికి మర్చంట్, అంబానీ కుటుంబాల వారితో పాటు పెద్ద సంఖ్యలో ప్రజాప్రతినిధులు, పారిశ్రామిక వేత్తలు తరలివచ్చారు.
రాధిక మర్చంట్ భరతనాట్యంలో ప్రావీణ్యురాలు. ఆమె 8 ఏళ్లుగా గురువు భావన ఠాక్రే వద్ద నేర్చుకుంటున్నారు. ఆదివారం మొదటిసారి వేదికపై ప్రదర్శన ఇచ్చారు. ముందుగా దైవానికి పుష్పాంజలి సమర్పించి.. గణేశ వందనంతో నాట్యాన్ని ప్రారంభించారు.
రాగమాలిక, రాముడి కోసం శబరి పడిన తపన, కృష్ణుడు-గోపికల నృత్యం, యశోదా కృష్ణుల కథ నటరాజ నృత్యం వంటి అంశాలను తన ఆహాభావాలతో ప్రదర్శించారు. చివరగా అష్ట రసాలు, థిల్లానా నృత్యంతో ముగించారు.
ముఖేశ్ అంబానీ భార్య నీతా అంబానీ కూడా నృత్యాకారిణియే. ఆమె కూడా భరతనాట్యం నేర్చుకున్నారు. దేశ, విదేశాల్లో నీతా అంబానీ ప్రదర్శన ఇచ్చారు. ఇప్పటికీ నీతా భరతనాట్య సాధన చేస్తారు. తాజాగా ఆమెకు కాబోయే కోడలు కూడా నృత్య కళాకారిణి కావడం విశేషం. కాగా రాధికా మర్చంట్ నాట్యాన్ని చూడడానికి వచ్చిన వారు.. ఆమె ప్రదర్శనకు ముగ్ధులయ్యారు. చప్పట్లతో ఆమెకు స్వాగతం పలికారు. భారత సంస్కృతిలో భాగమైన భరతనాట్యాన్ని ముఖేశ్ అంబానీ కోడలు చేయడం గొప్ప విషయమని అభినందించారు.