Begin typing your search above and press return to search.
ఒకే వేదిక మీదకు ఇద్దరు ప్రముఖులు
By: Tupaki Desk | 24 Dec 2021 3:30 PM GMTఒకరు దేశ అత్యున్నత న్యాయస్థానానికి ప్రధాన న్యాయమూర్తి. మరొకరు ఏపీ ముఖ్యమంత్రి. ఈ ఇద్దరూ ఒకే వేదికను పంచుకునే ఆసక్తికరమైన సన్నివేశం ఏపీలో ఆవిష్కృతం కాబోతోంది.జస్టిస్ ఎన్వీ రమణ ఏపీలో మూడు రోజుల పర్యటన చేపట్టారు. ఇందులో భాగంగా ఆయన తన సొంత వూరు అయిన క్రిష్ణా జిల్లా పొన్నవరంలో గడిపారు. ఆయనకు ఘనమైన స్వాగతం అక్కడ లభించింది.
ఇక ఆయన ఈ నెల 25న విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో రాష్ట్ర ప్రభుత్వ గౌరవ ఆతీధ్యాన్ని స్వీకరించబోతున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ జస్టిస్ ఎన్వీ రమణను తేనీటి విందుకు ఆహ్వానించనున్నారు.ఈ సందర్భంగా తన మంత్రులను వైఎస్ జగన్ జస్టిస్ ఎన్వీ రమణకు పరిచయం చేయనున్నారు. అదే విధంగా జస్టిస్ ఎన్వీ రమణ గౌరవ కార్యక్రమాల్లో పలువురు న్యాయమూర్తులు కూడా పాలుపంచుకోనున్నారు.
ఈ ఏడాది ఏప్రిల్ 24న సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులైన జస్టిస్ ఎన్వీ రమణ తెలుగు వారి ముద్దు బిడ్డ. ఆయన తన స్వయంకృషితో అంచెలంచెలుగా ఎదుగుతూ ఈ రోజు దేశానికి గర్వకారణం అయిన స్థాయిలో ఉన్నారు.
ఆయన జస్టిస్ అయ్యాక ఏపీలో ఇన్ని రోజులు పర్యటించడం ఇదే తొలిసారి. దాంతో ఆయనను ఏపీ సర్కార్ సత్కరించనుంది. మొత్తానికి రేపు జరిగే ఈ కార్యక్రమం పట్ల సర్వత్రా ఆసక్తి నెలకొంది.