Begin typing your search above and press return to search.

ఏపీలో రెండు సెల్ ఫోన్ల తయారీ యూనిట్లకు రంగం సిద్ధం

By:  Tupaki Desk   |   4 Jun 2020 4:30 AM GMT
ఏపీలో రెండు సెల్ ఫోన్ల తయారీ యూనిట్లకు రంగం సిద్ధం
X
ఏపీకి కొత్తగా పరిశ్రమలు ఏమీ రావట్లేదని.. జగన్ ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత కంపెనీలు రావటం మానేశాయన్న ప్రచారం పెద్ద ఎత్తున సాగుతోంది. తాము కాని అధికారంలో ఉండి ఉంటే.. ఈ పాటికి ఏపీ మొత్తం కంపెనీలతో నిండిపోయి ఉండేదన్నట్లుగా బిల్డప్ ఇచ్చే విపక్ష నేత చంద్రబాబు అండ్ కో జీర్ణించుకోలేని రీతిలో ఒక పెద్ద సెల్ ఫోన్ల తయారీ సంస్థ ఏపీలో మరిన్ని పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమైంది.

యాపిల్.. రెడ్ మీ లాంటి ప్రముఖ బ్రాండ్ల సెల్ ఫోన్లను తయారుచేసే ఫాక్స్ కాన్ రాష్ట్రంలో మరో రెండు యూనిట్లను తెరిచేందుకు సిద్ధమైంది. తైవాన్ కు చెందిన ఈ కంపెనీకి ఇప్పటికే శ్రీసిటీలో సెల్ ఫోన్ల తయారీ యూనిట్ ఉంది. ఇప్పటికే దానికున్న ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచనున్న విషయాన్ని కంపెనీ చెబుతోంది.

రానున్న ఐదేళ్ల వ్యవధిలో దేశీయ ఎలక్ట్రానిక్స్ మార్కెట్ విలువ 400 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని ఊరిస్తున్నారు. మాయదారి రోగాన్ని కట్టడి చేయటంలో ఏపీ సర్కారు అనుసరిస్తున్న వైనాన్ని ఫాక్స్ కాన్ ఇంటర్నేషనల్ హోల్డింగ్ (ఇండియా) ఎండీ.. కంట్రీ హెచ్ జోష్ ఫౌల్గర్ వెల్లడించారు. రాష్ట్రంలో ఇప్పటికే ఉన్న సెల్ ఫోన్ యూనిట్లకు అదనంగా మరోరెండు కొత్తవి రానుండటం ఏపీకి తీపికబురుగా చెప్పాలి.