Begin typing your search above and press return to search.

కలకలం: వూహాన్ కరోనా కవరేజ్ రిపోర్టర్స్ మిస్టింగ్

By:  Tupaki Desk   |   16 Feb 2020 8:20 AM GMT
కలకలం: వూహాన్ కరోనా కవరేజ్ రిపోర్టర్స్ మిస్టింగ్
X
చైనాలో వూహాన్ లో కరోనా వైరస్ పుట్టి ఇప్పుడు ఆ దేశంతోపాటు ప్రపంచాన్ని వణికిస్తోంది. ఇప్పటికే వందల సంఖ్యలో ప్రాణాలు పోయాయి. వేలమంది ఈ వైరస్ బారిన పడ్డారు. దాదాపు 11వేలకు పైగా మంది పరిస్థితి సీరియస్ గా ఉందట.. 66వేల మందికి పైగా ఈ వైరస్ సోకింది.

తాజాగా ఈ వైరస్ పుట్టిన చైనాలోని వూహాన్ లో అసలేం జరుగుతుందో ప్రపంచానికి చూపించాలని ఇద్దరు జర్నలిస్టులు అక్కడికి వెళ్లారు. చైనాలో ప్రస్తుతం వూహాన్ ను దిగ్భంధించారు. ఆ ప్రాంతంతో చైనాకు కనెక్టివిటీ లేకుండా చేశారు. సంబంధాలను తెంచేశారు. నిర్బంధించిన వూహాన్ లోకి వెళ్లిన ఇద్దరు పాత్రికేయులు ఫాంగ్ బిన్ - షెన్ కిషి లు వూహాన్ లోకి వెళ్లి అక్కడి వీడియోలను తీసి వేలాది మందికి సోషల్ మీడియాలో షేర్ చేశారు.

అయితే సదురు పాత్రికేయుల చానెల్స్ తాజాగా బంద్ అయిపోయాయి. ఇద్దరు పాత్రికేయుల ఆచూకీ కనిపించడం లేదట.. వాళ్ల నుంచి ఎలాంటి సమాచారం సోషల్ మీడియాలోకి రావడం లేదట.. జనవరి 25న వీరు యూట్యూబ్ లో పోస్టు చేసిన వీడియోను చైనా ప్రభుత్వం నిషేధించింది. ఫిబ్రవరి 1న 8శవాలను వూహాన్ లో తరలిస్తుండగా వీరు తీసిన వీడియో వైరల్ గా మారింది. దాంతో ఈ ఇద్దరు పాత్రికేయుల అకౌంట్లు బ్లాక్ అయ్యాయి. వారు ఏమయ్యారో కూడా చైనాలో తెలియని పరిస్థితి నెలకొంది. వీరిని పోలీసులు అరెస్ట్ చేశారా? లేక ఎక్కడైనా బలవంతంగా దాచారా అన్న విషయంలో ఇప్పటికీ స్పష్టత లేదట.. కరోనా వైరస్ తీవ్రతను ప్రపంచానికి చూపిస్తున్న వీరిని చైనా ఏం చేసిందనేది అంతుచిక్కని విధంగా ఉంది.