Begin typing your search above and press return to search.
కూటమికి షాక్...ఇద్దరు నేతల గుడ్ బై
By: Tupaki Desk | 20 Dec 2018 7:53 AM GMTమహాకూటమిలో కలకలం చోటుచేసుకుంది. ఉత్తర్ ప్రదేశ్ లో మాయావతిని మేనత్త (బువా) అని అఖిలేశ్ యాదవ్ ను (భతీజా) మేనల్లుడు అని రాష్ట్రంలో సంబోధిస్తుంటారు. అయితే ఈ ఇద్దరు నేతలు కాంగ్రెస్ కు షాకిచ్చినట్లు తెలుస్తోంది. ఆర్ ఎల్డీని కలుపుకొని కాంగ్రెస్ - బీజేపీయేతర ప్రత్యేక కూటమిని ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది. సీట్ల పంపకంపై ఈ మూడు పార్టీల మధ్య అవగాహన కూడా కుదిరినట్టు హిందీ దినపత్రిక దైనిక్ జాగరణ్ వెల్లడించింది. మాయావతి పుట్టినరోజు అయిన జనవరి 15న దీనిపై ఒక ప్రకటన వెలువడనుందని తెలిపింది. రాష్ట్రంలోని 80 లోక్ సభ స్థానాలకు గాను అజిత్ సింగ్ నేతృత్వంలోని రాష్ట్రీయ లోక్ దళ్ (ఆర్ ఎల్డీ)కి మూడు స్థానాలను కేటాయించాలని - మిగిలిన స్థానాలలో తామిద్దరం పోటీ చేయాలని సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ - బీఎస్పీ అధినేత్రి మాయావతి ఒక ఒప్పందానికి వచ్చినట్టు తెలిపింది. ఎస్పీ 37 సీట్లలో - బీఎస్పీ 38 స్థానాలలో పోటీ చేయాలని నిర్ణయించినట్టు పేర్కొంది. అయితే అమేథీ - రాయ్ బరేలీ స్థానాలను మాత్రం విడిచిపెట్టినట్టు పేర్కొంది. అమేథీకి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ - రాయ్ బరేలీకి యూపీఏ చైర్ పర్సన్ సోనియాగాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. యూపీలో కాంగ్రెస్ కు బదులుగా కొన్ని చిన్న పార్టీలకు సీట్లు కేటాయించాలని ఎస్పీ - బీఎస్పీలు నిర్ణయించినట్టు ఆ వార్తా కథనం తెలిపింది.
ఈ ఏడాది యూపీలో జరిగిన పలు ఉప ఎన్నికల్లో కలిసి పోటీ చేసిన ఈ రెండు పార్టీలు అధికార బీజేపీపై విజయం సాధించాయి. రాహుల్ గాంధీని ప్రధాని అభ్యర్థిగా అంగీకరించడంపై తమకు భిన్నాభిప్రాయాలున్నట్టు అఖిలేశ్ యాదవ్ ఇటీవల పేర్కొన్నారు. గతవారం జరిగిన తమిళనాడు మాజీ సీఎం కరుణానిధి విగ్రహావిష్కరణ కార్యక్రమంలో డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ మాట్లాడుతూ - ప్రతిపక్ష కూటమి తరఫున ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీని ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. అయితే స్టాలిన్ అభిప్రాయంతో తాము ఏకీభవించడం లేదని అఖిలేశ్ స్పష్టం చేశారు. ``బీజేపీ విషయంలో ప్రజలు అసంతృప్తిగా ఉన్న మాట వాస్తవమే. తెలంగాణ సీఎం కేసీఆర్ - మమతాజీ - శరద్ పవార్ లు అన్ని పార్టీల నేతలతో కూటమిని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. స్టాలిన్ అభిప్రాయంతో కూటమి ఏకీభవించాల్సిన అవసరం లేదు`` అని అఖిలేశ్ పేర్కొన్నారు.
అయితే, దీనిపై భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. బీఎస్పీ నాయకుడు అనుభవ్ చాక్ ఓ వార్తా సంస్థతో మాట్లాడుతూ - మూడు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించినంత మాత్రాన యూపీలో ఆ పార్టీతో కూటమి కట్టాలన్న ఒత్తిడి తమపై లేదని చెప్పారు. వచ్చే లోక్ సభ ఎన్నికల కోసం ఉత్తర్ ప్రదేశ్ లో కాంగ్రెస్ లేకుండా ఎస్పీ - బీఎస్పీలు కూటమి కట్టాయంటూ వస్తున్న వార్తలు అసత్యాలని బీఎస్పీ సీనియర్ నేత సతీశ్ మిశ్రా పేర్కొన్నారు. ఈ వార్తలకు ఆధారం ఏమిటో తమకు తెలియదన్నారు. ప్రస్తుతానికి ఎస్పీ - బీఎస్పీల మధ్య సీట్ల పంపిణీపై చర్చలు జరుగలేదని చెప్పారు. మాయావతి పుట్టిన రోజు వేడుకకు బీజేపీ - కాంగ్రెసేతర పక్షాల నేతలను ఆహ్వానిస్తున్నట్టు వార్తలు వచ్చాయి కదా అని ప్రశ్నించగా - అది కూడా అబద్ధమేనని అన్నారు. పుట్టినరోజు వేడుకలను అలా ఎవరూ జరుపుకోరన్నారు.