Begin typing your search above and press return to search.
భైంసాలో హైఅలెర్ట్.. అసలేం జరిగింది?
By: Tupaki Desk | 13 Jan 2020 9:25 AM GMTచిన్న వివాదం.. అది కాస్తా పెరిగి పెద్దది కావటమే కాదు.. హైఅలెర్ట్ అనుకునే వరకూ వెళ్లింది. ఇలాంటి పరిస్థితి మరెక్కడో కాదు తెలంగాణ రాష్ట్రంలోని నిర్మల్ జిల్లా భైంసాలో ఇలాంటి పరిస్థితి నెలకొంది. హైదరాబాద్ నగరానికి దూరంగా ఉన్న పట్టణం లో జరుగుతున్న గొడవ మీద టీవీ చానళ్లు పెద్దగా ఫోకస్ చేయకపోవటం.. అనవసరమైన హడావుడి చేయకుండా ఉండేలా చేయటంతో అక్కడి పరిస్థితి పెద్దగా బయటకు రాలేదు. నిజానికి అసలు అక్కడ సమస్య ఉందా? అంటే లేదనే చెప్పాలి. కేవలం పుకార్లు.. చెప్పుడు మాటలు.. అనవసరమైన ఉద్రిక్తతలే తాజా పరిస్థితికి కారణంగా చెబుతున్నారు.
నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలో రెండు వర్గాల మధ్య చోటు చేసుకున్న చిన్న వివాదం పెరిగి పెద్దది గా మారటమే కాదు.. అక్కడిప్పుడు హైఅలెర్ట్ పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్న ఈ పట్టణంలో ఇప్పుడు శాంతి భద్రతలకు ఎలాంటి లోటు రాకుండా చూసుకునేందుకు పోలీసులు విపరీతంగా శ్రమిస్తున్నారు. అసలేం జరిగిందన్న విషయంలోకి వెళితే.. ఆదివారం రాత్రి భైంసాలోని కోర్వ గల్లీలో ఒక వర్గం వారు మరో వర్గం వారిపై దాడి చేస్తున్నారన్న పుకార్లు హల్ చల్ చేశాయి.
దీంతో.. తమ మీద దాడులు జరుగుతున్నాయన్న భయంతో మరో వర్గం వారు ఆవేశానికి గురి కావటం.. పరిస్పరం రాళ్లతో కొట్టుకోవటంతో విషయం మరింత సీరియస్ గా మారింది. ఈ గొడవల్లోనే కొన్ని వీధుల్లో పార్క్ చేసిన 23 బైకులు.. రెండు ఆటోలు.. ఒక కారుకు గుర్తు తెలియని వారు నిప్పు అంటించారు. ఈ మంటల్లో గ్యాస్ సిలిండర్లను వేయటంతో అవి కాస్తా పేలాయి. ఇవి మరింత భయోత్పాతానికి గురయ్యేలా చేశాయి.
దీంతో రెండు వర్గాల మధ్య ఉద్రిక్తత మరింత పెరగటమే కాదు.. శాంతి భద్రతల్ని అదుపు లో ఉంచేందుకు రంగంలోకి దిగిన జిల్లా ఎస్పీ.. భైంసా డీఎస్పీ.. పట్టణ సీఐలకు సైతం గాయాలయ్యాయి. వీరితో పాటు.. పలువురు సామాన్యులు గాయాల పాలైనట్లుగా తెలుస్తోంది. రాత్రి తొమ్మిదిన్నర ప్రాంతంలో మొదలైన లొల్లి.. పెద్ద గొడవగా మారి.. అర్థరాత్రి రెండు గంటల వరకూ గొడవలు జరిగినట్లు గా చెబుతున్నారు. ప్రస్తుతం అదనపు బలగాలతో భైంసా పట్టణం ప్రశాంతంగా ఉన్నా.. నివురు గప్పిన నిప్పులా ఉందని చెప్పాలి. ఇప్పుడా పట్టణంలో 144 సెక్షన్ విధించారు. శాంతి భద్రతలు అదుపులో ఉన్నట్లు తెలుస్తోంది. అనవసరమైన పుకార్లను నమ్మొద్దని పోలీసులు కోరుతున్నారు.