Begin typing your search above and press return to search.

పైనాపిల్​ పండ్ల కోసం రెండు దేశాల యుద్ధం వెరీ ఇంట్రెస్టింగ్​..!

By:  Tupaki Desk   |   20 March 2021 5:30 PM GMT
పైనాపిల్​ పండ్ల కోసం రెండు దేశాల యుద్ధం వెరీ ఇంట్రెస్టింగ్​..!
X
చైనా ఓ వివాదాస్పద దేశంగా వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. తనకు సరిహద్దులో ఉన్న అన్ని దేశాలతో గిల్లికజ్జాలు పెట్టుకోవడం ఆ దేశానికి అలవాటు. మీడియాను నియంత్రణలో పెట్టుకోవడం.. ఆ దేశానికి వెన్నతో పెట్టిన విద్య. ఇతర దేశాలపై పెత్తనం చెలాయించాలని నిరంతరం చూస్తూ ఉంటుంది. గాల్వాన్​ కేంద్రంగా ఇటీవల ఇండియాతో కూడా ఘర్షణ పెట్టుకున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే తాజాగా చైనా తన పొరుగుదేశమైన తైవాన్​తో గొడవ పెట్టుకున్నది. నిజానికి తైవాన్​ అనేది ఓ దీవి. ఆ దీవిని చైనా తన ఆధీనంలో ఉన్నట్టు వ్యవహరిస్తూ ఉంటుంది. తైవాన్ మాత్రం స్వతంత్రంగా ఉండేందుకు ప్రయత్నిస్తుంటుంది.

ఇదిలా ఉంటే తాజాగా తైవాన్​ పైనాపిల్​ పండ్ల దిగుమతి విషయంలో ఇరు దేశాలకు గొడవ మొదలైంది. తైవాన్​ నుంచి పైనాపిల్​ పండ్ల దిగుమతిని చైనా నిలిపివేసింది. ఆ పండ్లపై రోగకారక క్రిములు ఉన్నాయని చైనా ఆరోపిస్తున్నది. దీంతో తైవాన్​ భగ్గుమన్నది. చైనా తమను రాజకీయంగా ఏకాకిని చేయడానికి ఇటువంటి తప్పుడు ఆరోపణలు చేస్తున్నదని తైవాన్​ అభిప్రాయపడుతున్నది. ఈ వివాదమే ఇరు దేశాలకు మధ్య చిచ్చు పెట్టింది.పైనాపిల్​ దిగుమతులను చైనా నిషేధించడంతో ... వేరే దేశాల్లో ఆ పండ్లను అమ్ముకోవాలని తైవాన్​ ప్రయత్నిస్తున్నది.

మరోవైపు తమ దేశ ప్రజలు కూడా ఈ పండ్లను భారీగా కొనుగోలు చేసి తినాలని సూచించింది. తైవాన్​ పైనాపిల్​ ఎంతో ఆరోగ్యకరమైనవి. ఈ పండ్లు ఎంతో శక్తినిస్తాయి. కొందరి రాజకీయ ప్రకటనలు ఈ పండ్ల పేరు ప్రఖ్యాతులను దెబ్బతీయలేవు. అని తైవాన్ ఉపాధ్యక్షుడు లెయ్ చింగ్-టె ట్వీట్​ చేశారు.

తైవాన్​లో ప్రతి ఏటా 4,20,000 టన్నుల పైనాపిల్ పండ్లను పండిస్తారు. ఇందులో ఈ పదిశాతం ఇతర దేశాలకు ఎగుమతి అవుతాయి. ముఖ్యంగా చైనాకే ఎక్కువ మొత్తంలో ఎగుమతి అవుతాయి. అయితే ప్రస్తుతం చైనా నిషేధం విధించడంతో .. తైవాన్​లో పైనాపిల్​ పండ్లకు ధర తగ్గే అవకాశం ఉంది. దీంతో ఇతర దేశాలకు పైనాపిల్స్​ విక్రయించాలని ఆ దేశం యోచిస్తున్నది. తైవాన్ ప్రజలు పైనాపిల్ పండ్లను కొనుగోలు చేయాలంటూ ఆ దేశ అధ్యక్షురాలు సాయ్ ఇంగ్-వెన్ పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆమె సోషల్​మీడియా వేదికగా "పైనాపిల్ ఛాలెంజ్"ను ప్రారంభించారు. ప్రపంచదేశాలన్నీ తమకు మద్దతు తెలపాలని ఆ దేశం కోరుతున్నది. తద్వారా చైనా కుట్రలను తిప్పికొట్టాలని సూచిస్తున్నది.

మరోవైపు తైవాన్‌లో ఉన్న అమెరికా, కెనడా రాయబార కార్యాలయాలు తైవాన్​కు మద్దతుగా నిలిచాయి. తైవాన్‌లో ఉన్న 'ది అమెరికన్ ఇనిస్టిట్యూట్' తమ ఫేస్​ బుక్​ పేజీలో పలు పైనాపిల్ పండ్ల ఫొటోలను పోస్ట్ చేసింది. తైపైలోని కెనడా వాణిజ్య కార్యాలయం కూడా పైనాపిల్ పిజ్జా ఫొటో పోస్ట్ చెయ్యడంతో పాటూ ఈ పిజ్జా ఐడియా హవాయిది కాదని, తమ సొంత ఆలోచన అని కూడా గుర్తు చేసింది.జపాన్​ వంటి దేశాల నుంచి కూడా తమకు పైనాపిల్స్​ కోసం ఆర్డర్స్​ ఎక్కువగా వస్తున్నాయని తైవాన్​ ప్రకటించింది. ఈ వివాదం ఎప్పటికి ముగుస్తుందో వేచి చూడాలి.