Begin typing your search above and press return to search.
లాక్ డౌన్ :కూల్ డ్రింక్ లో షేవింగ్ లోషన్ కలుపుకొని తాగి ఇద్దరు మృతి!
By: Tupaki Desk | 4 April 2020 12:10 PM GMTకరోనా వైరస్ ను అరికట్టడానికి దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ ను కేంద్రం విధించింది. అయితే, కరోనా వ్యాప్తిని అరికట్టడానికి లాక్ డౌన్ విధిస్తే ... ఈ సమయంలో మందుబాబుల పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. ప్రతి రోజు మందు చుక్క నోట్లో పడితే కానీ - నిద్ర రాని మందు బాబులు లాక్ డౌన్ కారణంగా మందు దొరకక పిచ్చి పడినట్టుగా ప్రవర్తిస్తున్నారు. ఈ లాక్ డౌన్ మందుబాబులకు నరకం చూపిస్తోంది. అలాగే మత్తు కోసం ఏవేవో పుకార్లు నమ్మి కొందరు మందుబాబులు ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు.
కూల్ డ్రింక్ లో షేవింగ్ లోషన్ కలుపుకొని తాగడంతో నాలుగు రోజుల క్రితం కేరళలో ఓ వ్యక్తి మరణించిన ఘటన మరువకముందే - తమిళనాడులో అలాంటి ఘటన జరిగింది. పుదుకొట్టై జిల్లాలోని ఇద్దరు మత్స్యకార యువకులు కూల్ డ్రింక్ లో షేవింగ్ లోషన్ కలుపుకొని తాగడంతో మరణించారు. మరొకరు ఆస్పత్రిలో ఎమర్జెన్సీ వార్డ్ లో చికిత్స తీసుకుంటున్నారు.
ఈ ఘటన పై పూర్తి వివరాలు చూస్తే .. కొట్టైపట్టినమ్ కు చెందిన ముగ్గురు మత్స్యకార యువకులు ఎం.హసన్ మైదీన్ - పి.అన్వర్ రాజా - ఎం.అరుణ్ కంతియాన్ నిత్యం మద్యం సేవించేవారు. అయితే, లాక్ డౌన్ తో మద్యం దుకాణాలు బంద్ కావడంతో - ఎవరో చెప్పిన మాటలు విని శుక్రవారం రాత్రి కూల్ డ్రింక్ లో షేవింగ్ లోషన్ కలుపుకొని సేవించారు. ఆ తరువాత ఎవరి ఇంటికి వారు వెళ్లారు. అయితే, మైదీన్ - అరుణ్ వాంతులు చేసుకోవడంతో వారిని ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స పొంతుతూ వారు ప్రాణాలు విడిచారు. అస్వస్థతకు గురైన అన్వర్ ను కూడా ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. అతని పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్టు సమాచారం. ఇకపోతే - ఐసో ప్రొపిల్ ఆల్కహాల్ ద్రావణం తాగి పశ్చిమ గోదావరిలో కూడా ఒక యువకుడు మరణించిన సంగతి తెలిసిందే.