Begin typing your search above and press return to search.
ఆ మీడియా అధినేతకు షాక్ ఇచ్చిన జగన్
By: Tupaki Desk | 19 Feb 2019 5:33 AM GMTటీడీపీలో కీలక నేతగా ఉన్న విజయ్ ఎలక్ట్రికల్స్ అధినేత దాసరి జై రమేష్ అనూహ్యాంగా వైసీపీలో చేరారు. జగన్ కూడా ఆయన్ను సాదరంగా ఆహ్వానించి పార్టీ కండువా కప్పారు. మొదటినుంచి వ్యాపారవేత్తగా పేరున్న జై రమేష్.. టీడీపీని వదిలినంత మాత్రానా వైసీపీకి పెద్దగా ప్లస్ ఏముండదు. కాని జై రమష్ ని వైసీపీలో చేర్చుకోవడం ద్వారా ఏబీఎన్ రాధాకృష్ణకు చెక్ పెట్టారు జగన్.
ఏబీఎన్ రాధాకృష్ణకు ఆంధ్రజ్యోతి పేపర్ తో పాటు ఏబీఎన్ చానెల్ కూడా ఉంది. పేపర్ - చానెల్ రెండూ చంద్రబాబునాయుడుకు అనుకూలం - వైసీపీకి వ్యతిరేఖం. చిన్న సందు దొరకాలే కానీ.. చంద్రబాబునాయుడికి బాకా ఊదడానికి ఏమాత్రం వెనకాడరు రాధాకృష్ణ. అసలు తాను పుట్టిందే చంద్రబాబు నాయుడు కోసం అన్నట్లుగా బిహేవ్ చేస్తుంటారు. ఏపీలో టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రత్యక్షంగా పరోక్షంగా రాధాకృష్ణకు చాలా మేళ్లు జరిగాయనే విషయం అందరికి తెలిసిందే దీంతో.. ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో కూడా చంద్రబాబు నాయుడ్ని తన పేపర్ చానెల్ తో దగ్గరుండి గెలిపించాలనుకున్నారు రాధాకృష్ణ. అయితే.. ఏబీఎన్ గ్రూప్ లో ప్రదాన ప్రమోటర్ జై రమేష్. దాదాపు జై రమేశ్ కు ఏబీఎన్ గ్రూపులో 25 శాతం వాటా ఉంది. సో.. ఇదివరకటిలా ఇప్పుడు జగన్ ని విమర్శించలేడు. అలాగని చంద్రబాబుని పొగడలేడు. ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ.. తనపై నెగిటివ్ వార్తల్ని ప్రచారం చేసే ఆంధ్రజ్యోతి గ్రూప్ ని జై రమేష్ ద్వారా కంట్రోల్ లో పెట్టారు జగన్.