Begin typing your search above and press return to search.
త్వరలో రెండు డోసుల వ్యాక్సిన్ విరామ సమయం తగ్గింపు!
By: Tupaki Desk | 22 Sep 2021 7:32 AM GMTప్రస్తుతం దేశంలో కరోనా వ్యాక్సినేషన్ కు సంబంధించి రెండు డోసుల మధ్యన విరామ సమయాన్ని 12 నుంచి 16 వారాలుగా ఉంచింది కేంద్ర ప్రభుత్వం. తొలి డోసు వేయించుకున్న కనీసం 84 రోజుల తర్వాత కానీ రెండో డోసు వ్యాక్సిన్ పొందే అవకాశం లేదు. ఈ విషయంలో నియమాలు స్ట్రిక్ట్ గా ఉన్నాయి.
కోవిడ్ వ్యాక్సినేషన్ డేటా అంతా కంప్యూటరైజ్డ్ కావడంతో.. 84 రోజుల సమయం పూర్తి కాకుండా, రెండో డోసు వ్యాక్సిన్ పొందడం ఎవరికీ సాధ్యం కావడం లేదు. అయితే వ్యాక్సిన్ ఇచ్చే సిబ్బందికి ఏదో చెప్పుకుంటే.. ముందుగానే వ్యాక్సిన్ ఇచ్చి, ఎంటర్ చేయడం మాత్రం 84 రోజుల తర్వాత చేస్తున్నారట. అది కేవలం పరిమితమైన వ్యవహారమే.
ఇక ఇటీవలే ఒక రాష్ట్ర హై కోర్టు ఈ విషయంలో అభ్యంతరం చెప్పింది. కనీసం విదేశాలకు వెళ్లాలనుకునే వారికి అయితే విరామం మినహాయింపును ఇవ్వాలని, 84 రోజుల్లోపే వారికి వ్యాక్సిన్ ఇచ్చే ఏర్పాట్లు చేయాలని ఆదేశించింది. అయితే ఈ విషయంపై కేంద్రం ఇంకా ఏమీ స్పందించడం లేదు.
వ్యాక్సిన్ కు ఫుల్ డిమాండ్ పెరిగిన రోజుల్లో ఈ విరామాన్ని పెంచారు. విరామం ఉండటం మంచిదే అని పరిశోధకులు చెప్పుకొచ్చారు. అయితే డిమాండ్ వల్లనే ఈ విరామాన్ని పెంచారనే టాక్ ఉండనే ఉంది. అయితే ఇప్పుడు వ్యాక్సిన్ డోసులకు మరీ తీవ్రమైన డిమాండ్ లేదు.
చాలా మంది రెండో డోసు వ్యాక్సినేషన్ చేయించుకోవడం లేదు! వీరి సంఖ్య కోట్లలో ఉంది. అలాగే ఉత్పత్తి పెరిగినట్టుగా ఉంది. అందుకే విదేశాలకు కోవిడ్ వ్యాక్సిన్ డోసులను ఎగుమతి చేయడానికి కేంద్రం రెడీ అవుతోంది. ఇలాంటి నేపథ్యంలో రెండు డోసుల మధ్యన విరామ సమాయాన్ని తగ్గిస్తున్నారట. మొదటి డోసు వేయించుకున్న నాలుగు వారాల్లోనే.. రెండో డోసు వేయించుకోవడానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వబోతున్నారట.