Begin typing your search above and press return to search.

అభిమాన నటుడు సినిమా చూడాలంటే రెండు డోసులు తప్పనిసరి..!

By:  Tupaki Desk   |   12 Dec 2021 4:30 PM GMT
అభిమాన నటుడు సినిమా చూడాలంటే రెండు డోసులు తప్పనిసరి..!
X
కరోన మహమ్మారి చైనాలో పుట్టి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అన్ని దేశాలకు విస్తరించింది. ఈ వైరస్ నుంచి పుట్టుకొచ్చిన కొత్త వేరియంట్లలో మరింత ప్రమాదంలో మానవాళిని నిలిపాయి. ఇప్పటికే చాలా దేశాలు వైరస్ ఎదుర్కొనేందుకు అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇందులో భాగంగానే పెద్ద మొత్తంలో ఆయా దేశాలు వ్యాక్సినేషన్ డ్రైవ్ లను నిర్వహిస్తున్నాయి. వ్యాక్సినేషన్ ను పెద్ద మొత్తంలో చేపట్టడానికి వివిధ దేశాలు ప్రైజ్ మనీ, ఉచిత టీకా, ఆఫర్స్ లాంటి వాటిని ప్రకటించాయి. మన దేశంలో కూడా ఇందుకు తగ్గట్టుగానే టీకా పంపిణీ కార్యక్రమం పెద్ద ఎత్తున జరిగింది. వంద కోట్లకు పైగా డోసులను కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే పంపిణీ చేసి రికార్డు సృష్టించింది. మొదటి డోసు ను తీసుకున్న వారు 70 శాతానికి పైగా ఉన్నారు. అదేవిధంగా రెండు డోసులు పూర్తయిన వారు 35 శాతానికి పైగా ఉన్నారు. ఇంకా పంపిణీ కార్యక్రమం నిర్విరామంగా కొనసాగుతూనే ఉంది. వ్యాక్సినేషన్ డ్రైవ్ లో ప్రజలను భాగస్వామ్యం చేయడానికి చాలా రాష్ట్రాల్లో ప్రజల వద్దకే పాలన లాగా.. ప్రజల వద్దకే టీకాలను తీసుకెళ్తున్నారు.

వ్యాక్సినేషన్ డ్రైవ్ పుంజుకోవడంతో కరోనా తగ్గుముఖం పట్టింది. ఈ క్రమంలో సినిమా హాల్స్ కూడా అనుమతులు ఇస్తూ చాలా రాష్ట్రాలు ఉత్తర్వులు జారీ చేశాయి. దీంతో పాక్షికంగా ప్రేక్షకులతో సినిమా థియేటర్లు ఓపెన్ అయ్యాయి. దీనినే అదునుగా తీసుకుని తమిళనాడులోని ఓ జిల్లా కలెక్టర్ వ్యాక్సినేషన్ డ్రైవ్ ను ఏకంగా సినిమా థియేటర్ దగ్గర ప్రారంభించారు. రెండు డోసులను పూర్తి చేసుకున్న వారికి మాత్రమే సినిమా చేసే అవకాశం ఉంటుందని స్పష్టం చేశారు. దీంతో చేసేది ఏమి లేక టీకా తీసుకొని వారు.. అభిమాన నటుడు సినిమాకు వచ్చి వెనక్కి పోతే బాగోదని చాలా మంది వ్యాక్సినేషన్ లో భాగమయ్యారు. ముఖ్యంగా యువతలో వ్యాక్సినేషన్ పెంచడమే లక్ష్యంగా ఇలాంటి డ్రైవ్లు చేపడుతున్నట్లు జిల్లా కలెక్టర్ జాన్ వర్గీస్ తెలిపారు. కేవలం సినిమా హాల్ దగ్గర మాత్రమే కాకుండా... యువత ఎక్కువగా వచ్చే ప్రదేశాలైన మాల్స్ దగ్గర కూడా ఎలాంటి డ్రైవ్లు చేపట్టారు.

ప్రస్తుతం జాన్ వర్గిస్ తమిళనాడులోనే తిరుత్తణ్ణి జిల్లాకు కలెక్టర్ గా ఉన్నారు. ఆయన బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి కరోనా పై పోరాటం లో జిల్లా వ్యాప్తంగా పెద్ద మొత్తంలో టీకా పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ జిల్లాలో కేవలం వ్యాక్సిన్ తీసుకోవాల్సిన వారి సంఖ్య 20 శాతానికి లోపే ఉంది. వారిని కూడా త్వరలోనే టీకా తీసుకునేలా చేస్తామని వర్గీస్ చెప్తున్నారు. ఇందుకుగానూ స్పెషల్ డ్రైవ్ లను కొనసాగించాలని నిర్ణయించారు. రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్లలో ఈ డ్రైవ్లను ఏర్పాటు చేసి టీకా పంపిణీని మరింత ముందుకు తీసుకు వెళ్లాలా... చర్యలు చేపట్టాలని జిల్లా అధికారులను ఆదేశించారు.