Begin typing your search above and press return to search.
పవన్ పార్టీకి గ్లాస్ కు బ్యాట్ తోడైంది!
By: Tupaki Desk | 25 April 2019 5:04 AM GMTకాంగ్రెస్ హస్తం. తెలుగుదేశం సైకిల్.. టీఆర్ ఎస్ కారు.. వైఎస్సార్ కాంగ్రెస్ ఫ్యాన్.. ఇలా పార్టీతో పాటు.. ఆయా పార్టీల గుర్తులు పాపులర్. అయితే.. పవన్ పెట్టిన జనసేన గుర్తు గ్లాస్.. ఇప్పుడిప్పుడే రిజిస్టర్ అవుతున్న వేళ.. తాజాగా ఎన్నికల సంఘం ఆ పార్టీకి మరో గుర్తును కూడా ఇచ్చింది.
జనసేన పార్టీకి ఇప్పటికే ఇచ్చిన గ్లాస్ గుర్తుకు కొత్తగా బ్యాట్ వచ్చి చేరింది. ఎందుకిలా? అంటే.. తెలంగాణలో జరుగుతున్న జెడ్పీటీసీ..ఎంపీటీసీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న వేళ.. ఆ పార్టీకి రెండో గుర్తును ఇస్తూ.. ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. దీంతో.. ఇప్పుడా పార్టీకి గ్లాస్ తో పాటు.. బ్యాట్ కూడా వచ్చి చేరినట్లైంది. తెలంగాణలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పరిమిత స్థానాల్లో తన ఫ్రెండ్ బీఎస్పీతో కలిసి పోటీ చేయటం తెలిసిందే.
తొలిసారి తెలంగాణలో పోటీ చేసిన జనసేన పెద్దగా ప్రభావం చూపింది లేదు. ప్రధాన రాజకీయ పార్టీలు అయితే.. జనసేన పోటీని లెక్కలోకి కూడా తీసుకోలేదు. ఇదిలా ఉంటే.. సార్వత్రిక ఎన్నికల్లో సత్తా చాటకున్నా.. స్థానిక ఎన్నికల్లో మాత్రం తమ ప్రభావం ఉంటుందని.. తామేంటో ఫ్రూవ్ చేసుకుంటామని చెబుతున్నారు.
జెడ్పీటీసీ ఎన్నికల్లో జనసేన పార్టీకి గ్లాస్.. ఎంపీటీసీ ఎన్నికల్లో పార్టీకి బ్యాట్ గుర్తును కేటాయించారు. ఎన్నికల వేళ.. ఈ గుర్తుల కన్ఫ్యూజన్ లో ఉన్న కొద్దిమంది ఓటర్లు పడితే? అన్న ప్రశ్నకు మాత్రం సమాధానం చెప్పట్లేదు. తాజాగా జరుగుతున్న స్థానిక ఎన్నికల్లో తమ సత్తా చాటుతామని చెబుతున్న జనసేన.. అదెంతన్న విషయం ఎన్నికల ఫలితాలతో లెక్క తేలుతుందని చెప్పక తప్పదు.