Begin typing your search above and press return to search.

క‌క్కుర్తి ఎధ‌వ‌లు: ‌రూ.75 వేల‌కు దేశ ర‌హాస్యాలు తాక‌ట్టు

By:  Tupaki Desk   |   9 Jun 2020 1:30 PM GMT
క‌క్కుర్తి ఎధ‌వ‌లు: ‌రూ.75 వేల‌కు దేశ ర‌హాస్యాలు తాక‌ట్టు
X
హానీ ట్రాప్ అనేది దేశ రక్షణ వ్యవస్థ‌కు ప్ర‌మాద‌క‌ర సంఘ‌ట‌న‌గా నిలిచింది. అమ్మాయిలను వ‌ల‌గా వేసి శ‌త్రువులు దేశ భ‌ద్ర‌తకు సంబంధించిన వివ‌రాల‌ను ట్రాప్ చేయ‌డానికి ప్ర‌య‌త్నించ‌న కేసులో చాలా మంది అరెస్ట‌వుతున్నారు. దీనికి సంబంధించిన విచార‌ణ కొన‌సాగుతోంది. అలాంటి సంఘ‌ట‌నే మ‌రోటి చోటుచేసుకుంది. ర‌క్ష‌ణ రంగానికి చెందిన ఇద్ద‌రు ఉద్యోగులు డ‌బ్బుల‌కు క‌క్కుర్తి ప‌డి దేశానికి సంబంధించిన ర‌హాస్యాల‌ను శ‌త్రు దేశాల‌కు తాక‌ట్టు పెట్టారు. అలా చేసిన వారిద్ద‌రిని అరెస్ట్ చేసి విచార‌ణ చేస్తున్నారు. ఈ ఘ‌ట‌న రాజస్ధాన్‌లో జ‌రిగింది. వారిద్దరు ఏమేమి ర‌హాస్యాలు పాకిస్తాన్‌కు చెందిన వారికి ఇచ్చారోన‌ని కలకలం రేపుతోంది.

రాజస్థాన్ పాకిస్తాన్‌కు స‌రిహ‌ద్దుగా ఉంది. ఆ దేశానికి సరిహద్దులుగా శ్రీగంగానగర్, బికనేర్ ఉన్నాయి. ఈ రెండు ప్రాంతాలు రెండు భారత రక్షణకు చాలా కీలకంగా ఉన్నాయి. శ్రీగంగానగర్ లో మందు గుండు సామగ్రి డిపో ఉండగా.. బికేనర్‌లో మహాజన్ ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్ ఉంది. శ్రీగంగానగర్ డిపోలో వికాస్ కుమార్ (29) పనిచేస్తుండగా, బికనేర్ ఫైరింగ్ రేంజ్‌లో కాంట్రాక్టు ఉద్యోగిగా చిమన్ లాల్ ప‌ని చేస్తున్నాడు. వీరిద్దరినీ హనీ ట్రాప్ చేయాలని పాకిస్తాన్ ఆర్మీకి అనుబంధంగా పనిచేసే ఐఎస్ఐ భావించింది. ముల్తాన్ కు చెందిన ఓ యువతిని అనుష్కా చోప్రా పేరుతో వీరిద్దరికీ ఫేస్ బుక్ ద్వారా పరిచయమైంది. ఆమె నుంచి వచ్చే సందేశాలకు ఆకర్షితులైన వీరిద్దరూ కీలకమైన సమాచారాన్ని షేర్ చేసుకోవడం మొదలుపెట్టారు.

సరిహద్దుల్లోని రక్షణ స్ధావరాలు, కీలక వ్యవస్థ‌లపై నిఘా ఉంచే మిలిటరీ ఇంటిలిజెన్స్ కంటికి వికాస్ కుమార్, చిమన్ లాల్ గ‌తేడాది చిక్కారు. వీరిద్దరిపై అనుమానం వచ్చి రాజస్థాన్ పోలీసులతో కలిసి నిఘా పెట్టిన మిలిటరీ ఇంటిలిజెన్స్ అధికారులకు వీరి బాగోతం తెలిసింది. సైనిక స్థావరాల్లో ఉంటూ అక్కడి సమాచారాన్ని ఫొటోలు, వీడియోలు, సందేశాల రూపంలో పాకిస్తాన్‌కు చేరవేస్తున్నారని గుర్తించారు. దీంతో వీరిని పక్కాగా పట్టుకునేందుకు స్కెచ్ వేశారు.

సరైన ఆధారాలు లేకుండా రక్షణ శాఖ ఉద్యోగులను అరెస్టు చేస్తే కలకలం రేగే అవ‌కాశం ఉంది. మిగతా వారు ఎవ‌రైనా ఉంటే అప్రమత్తమ‌య్యే ప్రమాదం ఉండ‌డంతో ఎవరికీ అనుమానం రాకుండా గతేడాది ఆగస్టులో ఆపరేషన్ డిజర్ట్ ఛేజ్ పేరుతో ఓ ప్రత్యేక ఆపరేషన్ చేశారు. మిలిటరీ ఇంటెలిజెన్స్ ఆధ్వ‌ర్యంలో రాజస్థాన్ పోలీసులతో కలిసి దాదాపు ఏడాదిగా ఈ ఆపరేషన్ చేశారు. ఈ స‌మ‌యంలో పలు కీలక అంశాలు బయటపడ్డాయి. దేశ రహస్యాలు పాకిస్తాన్ ముష్కరులకు ఎలా చేరుతున్నాయో గుర్తించారు. పక్కా ఆధారాలతో తాజాగా వీరిద్దరినీ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న జాయింట్ ఆపరేషన్ టీం అరెస్ట్ చేసి మిలిటరీ కోర్టులో హాజరుపరిచింది.

వికాస్ కుమార్, చిమన్ లాల్‌ను అదుపులోకి తీసుకున్న మిలిటరీ ఇంటిలిజెన్స్ అధికారులు వారిని విచారిస్తున్నారు. ఈ సంద‌ర్భంగా ప‌లు విష‌యాలు వెలుగులోకి వ‌చ్చాయి. వారిద్ద‌రూ కేవ‌లం రూ.75 వేల కోసం తీవ్రవాద ముఠాలకు అమ్ముడుపోయారనతెలిసింది.