Begin typing your search above and press return to search.

టిక్ టాక్ వీడియో చూసి కరోనా రాదని ఉమ్మెత్త గింజలు రసం తాగారు..?

By:  Tupaki Desk   |   7 April 2020 12:30 PM GMT
టిక్ టాక్ వీడియో చూసి కరోనా రాదని ఉమ్మెత్త గింజలు రసం తాగారు..?
X
ప్రపంచాన్ని భయంతో వణికిస్తున్న కరోనా వైరస్ కు సొంత వైద్యం పనికిరాదు అని వైద్యులు, నిపుణులు హెచ్చరిస్తూనే ఉన్నా కూడా ఇంకా కొంతమంది మారడం లేదు. ఇవి తింటే కరోనా రాదు.. అవి తింటే కరోనా రాదు అంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న వీడియోలలోని సారాంశాన్ని పాటించి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. తాజాగా టిక్ టాక్ వీడియో ఒకటి వైరల్ అవ్వడం తో ..దాన్ని ఫాలో అయిన రెండు కుటుంబాలు ఇప్పుడు ప్రాణాలమీదకు తెచ్చుకున్నారు.

ఈ ఘటన చిత్తూరు జిల్లాలో జరిగింది. బైరెడ్డిపల్లి మండలం ఆళ్లపల్లికి చెందిన రెండు కుటుంబాలు.. టిక్‌టాక్‌లో ఓ వీడియో చూశారు. అందులో ఉమ్మెత్త గింజలు తింటే కరోనా రాదని చెప్పగా అలాగే చేశారు. ఆ ద్రావణం తాగిన తరువాత 8 మంది పరిస్థితి విషమంగా ఉందని.. ట్రీట్మెంట్ చేస్తున్నామని డాక్టర్లు చెబుతున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అసలు ఆ టిక్‌ టిక్ వీడియా ఎవరు పెట్టారు అని ఆరా తీస్తున్నారు.

కరోనాకు మందు లేదని ఎప్పటి నుంచో అందరికీ తెలుసు.. సోషల్ మీడియా లో జరుగుతున్న ప్రచారంపై పోలీసులు, అధికారులు పదే, పదే ప్రజల్ని అప్రమత్తం చేస్తున్నారు. తప్పుడు వీడియోలు, ఫోటోలు, వార్తల్ని షేర్ చేయొద్దంటున్నారు. కానీ , కొంతమంది మాత్రం షేర్ చేస్తూనే ఉన్నారు. ఒకవేళ ఎవరైనా తప్పుడు ప్రచారం చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు.