Begin typing your search above and press return to search.
ఉయ్యాల ఊగుతూ.. 6300 అడుగుల లోయలో పడ్డారు .. కానీ , ఆ తర్వాత ఏమైందంటే ?
By: Tupaki Desk | 15 July 2021 8:32 AM GMTఉయ్యాల ఊగడం అనేది అందరికి సరదాగానే ఉంటుంది. ఉయ్యాలని చూడగానే చిన్నప్పటి రోజులు గుర్తుకు వస్తాయి. చిన్నప్పుడు అమ్మలు ఉయ్యాలలో కూర్చోబెట్టి, గోరుముద్దలు తినిపించే రోజులు జీవితంలో ఎంతో మధురమైనవి. అయితే , అదే ఉయ్యాలని కొండా అంచుల మీద నుండి లోయ లోపలికి ఊగితే ఆ థ్రిల్ చెప్పలేనిది. వాళ్లు కూడా అదే అనుకున్నారు. కొండ అంచున ఉన్న ఓ ఉయ్యాలలో కూర్చొని ఆ థ్రిల్ ను ఆస్వాదించారు.
అయితే, ఉయ్యాల కదులుతుండగానే దిగేందుకు ప్రయత్నించి, ఒక్కసారిగా వేల అడుగుల లోతు గల లోయలో జారిపోయారు. దీనికి సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా లో వైరల్ అవుతోంది. ఈ ఘటన రష్యాలోని డాగేస్టన్ లో చోటుచేసుకుంది.
రష్యాలోని డాగేస్టన్ లోని సులాక్ కాన్యాన్ ప్రాంతంలో పర్యాటకులను ఆకట్టుకోవడం కోసం కొండ అంచున ఓ ఉయ్యాల ఏర్పాటు చేశారు. దీంతో పర్యాటకులు ఆ ఉయ్యాలలో కూర్చొని సరికొత్త అనుభూతిని పొందుతున్నారు. ఈ ఉయ్యాల భద్రత ప్రమాణాలకు తగినట్లుగా లేదని, ఎవరైనా ఆ ఉయ్యాల నుంచి జారితే 6300 లోతైన లోయలో పడి మరణిస్తారని హెచ్చరించిన స్థానిక ప్రభుత్వం వినిపించుకోలేదు.
ఆ ఫలితంగా ఇద్దరు మహిళలు ఉయ్యాల ఊగుతూ కొండ అంచు నుంచి లోయలోకి పడిపోయారు. అయితే, వారికి, ఇంకా దేవుడు భూమి మీద బ్రతికే ఛాన్స్ ఇచ్చాడు కాబట్టి కొద్దిలో ప్రాణాలతో బయటపడ్డారు.
మీకేమైనా పిచ్చా .. అంత ఎత్తు నుంచి కిందపడితే చనిపోకుండా ,ప్రాణాలతో బయటపడ్డారా అని ఆలోచిస్తున్నారా, సోషల్ మీడియాలో వైరల్ గా చక్కర్లు కొడుతున్న వీడియో ప్రకారం,. ఆ ఉయ్యాలలో కూర్చొన్న ఇద్దరు యువతులు ఉయ్యాల లోయలోకి వెళ్లడం చూసి భయపడ్డారు. దీనితో వారు కదులుతున్న ఉయ్యాల నుంచి హడావిడిగా దిగేందుకు ప్రయత్నించారు. దాని వల్ల ఉయ్యాల అక్కడ ఉన్న ఓ స్తంభానికి తగిలి వారిని లోయాలోకి తోసేసింది.
అయితే, వారు కొండ అంచున ఏర్పాటు చేసిన డెక్కింగ్ ప్లాట్ ఫాం మీద పడటంతో ప్రాణాలు పోకుండా , చావు చివరి అంచుదాకా వెళ్లి బయటపడ్డారు. ఆ ఉయ్యాల కొంచెం ఎక్కువ వేగంగా ఊగి ఉంటే వారు నేరుగా లోయలో పడిపోయేవారు. ఈ ఘటనలో వారికి స్వల్ప గాయాలయ్యాయని అధికారులు తెలిపారు. ప్రమాదానికి గల కారణాలపై విచారణ జరుపుతున్నట్లు వెల్లడించారు.