Begin typing your search above and press return to search.

అమెరికా సంప‌న్న మ‌హిళా జాబితాలో మ‌నోళ్లు

By:  Tupaki Desk   |   13 July 2018 11:05 AM GMT
అమెరికా సంప‌న్న మ‌హిళా జాబితాలో మ‌నోళ్లు
X
విదేశాల్లో మ‌నోళ్లు ప్ర‌ద‌ర్శించిన స‌త్తా ఇప్ప‌టికే ప్ర‌పంచానికి అర్థ‌మ‌వుతున్న సంగ‌తి తెలిసిందే. భార‌తీయులే కాదు.. భార‌త్ మూలాలు ఉన్న మ‌హిళ‌లు ఇద్ద‌రు వార్త‌ల్లో వ్య‌క్తుల‌య్యారు. సొంత ప్ర‌తిభ‌తో.. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా అత్య‌ధిక సంప‌ద‌ను సృష్టించిన 60 మంది మ‌హిళ‌ల‌తో కూడిన జాబితాను ఫోర్బ్ త‌యారు చేసింది.

ఇందులో భార‌త మూలాలు ఉన్న ఇద్ద‌రు మ‌హిళ‌లు చోటు సంపాదించుకోవ‌టం విశేషంగా చెప్పాలి. భార‌తీయ మూలాలున్న‌ సాంకేతిక నిపుణురాలు 57ఏళ్ల‌ జ‌య‌శ్రీ ఉల్లాల్ సుమారు రూ.8840 కోట్ల‌తో 18వ స్థానంలో నిలిచారు. అంతేకాదు.. లండ‌న్ లో పుట్టిన ఆమె.. భార‌త్‌లో పెరిగిన ఆమె.. కంప్యూట‌ర్ నెట్ వ‌ర్కింగ్ సంస్థ అరిష్టా నెట్ వ‌ర్క్ కు సీఈవోగా ఉన్నారు.

మ‌రో సాంకేతిక నిపుణురాలు నీర‌జా సేథి సుమారు రూ.6800 కోట్ల సంప‌ద‌తో 21వ స్థానంలో నిలిచారు. ఔట్ సోర్సింగ్ సంస్థ సింటెల్ కు వైస్ ప్రెసిడెంట్ గా నిలిచిన ఆమెకు భార‌తీయ మూలాలు ఉన్నాయి. ఇక‌.. ఈ జాబితాలో మొద‌టి స్థానంలో నిలిచారు ఔత్సాహిక వ్యాపార‌వేత్త అయిన 21 ఏళ్ల కైలీ జెన్న‌ర్‌. రియాలిటీ టీవీ స్టార్ గా ఆమెకు మంచి పేరు ఉంది.