Begin typing your search above and press return to search.
గాలి పీలుస్తున్నందుకు నిమిషానికి ఇద్దరు బలి
By: Tupaki Desk | 20 Feb 2017 5:10 AM GMTశ్వాస తీసుకోకుండా ఏ ప్రాణి అయినా బతుకగలదా..? లేదు. అయితే, మున్ముందు శ్వాస తీసుకుంటేనే చనిపోయే పరిస్థితులు రావచ్చు. ఇందుకు ప్రకృతి వైపరీత్యమో.. లేదా మరే కారణమో కాదు. కేవలం నిర్లక్ష్యం. మనుషులు తేలిగ్గా తీసుకుంటున్న అనేక విషయాలు వారి మెడపై కత్తులుగా వేలాడుతున్నాయి. అందులో ప్రధానమైనది వాయుకాలుష్యం. ఎందుకంటే ఒక్క భారతదేశంలోనే వాయు కాలుష్యం కారణంగా నిమిషానికి రెండు నిండు ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. ప్రపంచబ్యాంకు అంచనా ప్రకారం భారతదేశంలో వాయుకాలుష్యం కారణంగా పరిశ్రమల్లో ఉత్పత్తి నిలిచిపోవడం.. కార్మికులకు ఉపాధి లేకపోవడం వల్ల ఏటా 3800కోట్ల నష్టం వాటిల్లుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఈ మొత్తం 1462500 కోట్లు ఉన్నదని ప్రపంచబ్యాంకు ఆందోళన వ్యక్తం చేసింది. లాన్సెట్ కథనం ప్రకారం భారత్ వాయు కాలుష్యానికి 50శాతం కారణం.. బొగ్గుతో పనిచేసే విద్యుత్ ఉత్పత్తి కర్మాగారాలు. 130 కోట్లమంది జనాభా ఉన్న భారతదేశంలో వాయు కాలుష్యం అంచనా వేసేందుకు ప్రభుత్వం ఏటా చేస్తున్న ఖర్చు రూ. 7 కోట్లు మాత్రమే. మరోవైపు వాయుకాలుష్యం కారణంగా దేశంలో ఏటా లక్షల సంఖ్యలో మనుషుల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి.
మనిషికి ప్రాణవాయువు అయిన ఆక్సిజన్.. నేడు కాలుష్యం కారణంగా విషవాయువుగా మారి మనుషుల ప్రాణాల్నే హరించివేస్తోందని తాజా సర్వేలో తేల్చింది.మెడికల్ జర్నల్ అయిన ది లాన్సెట్ నిర్వహించిన 2010 నాటి డాటా ఆధారంగా నిర్వహించిన ఓ అధ్యయనంలో వాయు కాలుష్యం కారణంగా భారత్ లో ప్రతి నిమిషానికి ఇద్దరు ప్రాణాలు కోల్పోతున్నారని తేలింది. అంటే గంటకు 120 - రోజుకు 2880 - వారానికి 20160 - నెలకు 86400 - ఏడాదికి 10,25,280మంది చనిపోతున్నారు. దేశ రాజధాని ఢిల్లీ - బీహార్ రాజధాని పాట్నాలో పీఎం స్థాయి 200కుపైగా ఉండటం మృత్యుఘంటికలు మోగిస్తున్నదని ఇటీవలే 48మంది పర్యావరణ శాస్త్రవేత్తలు ఓ నివేదిక కూడా విడుదల చేశారు.
శిశువుల ఉసురు తీస్తున్న నలుసు ప్రపంచవ్యాప్తంగా వాయు కాలుష్యం శిశువుల పాలిట ప్రాణాంతకంగా మారింది. గర్భిణుల ద్వారా పసిగుడ్డులకు చేరుతున్న నలుసు పదార్థం వారి ఉసురు తీస్తోంది. ప్రపంచవ్యాప్తంగా వాయు కాలుష్యం కారణంగా 2010 నుంచి ఇప్పటివరకు 30 లక్షల మంది నెలలు నిండని శిశువులు మృత్యువాత పడినట్టు స్వీడన్ కు చెందిన పర్యావరణ శాస్త్రవేత్తలు ఇటీవల దిగ్భ్రాంతికర నివేదికను విడుదల చేశారు. ఇందులో దక్షిణాసియాకు చెందిన శిశువులు 16లక్షల మంది ఉన్నారని పేర్కొన్నారు. పారిస్ ఒప్పందం ప్రపంచవ్యాప్తంగా అమలైతేనే వాతావరణ మార్పులు తగ్గి పర్యావరణ సమతుల్యత సాధ్యమవుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ వో) వాతావరణ మార్పుల విభాగానికి అధిపతులైన డాక్టర్ డయార్మిడ్ క్యాంప్ బెల్ - లెన్ డ్రమ్ ఆకాంక్షించారు. వాయు కాలుష్యం వల్ల దేశంలో ఏటా ఎన్ని మరణాలు సంభవిస్తున్నాయన్న వివరాలు ప్రభుత్వం వద్ద అందుబాటులో లేవని అడవులు - పర్యారవణం శాఖల మంత్రి అనిల్ మాధవ్ దవే ఇటీవలే పార్లమెంట్ లో చెప్పారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/