Begin typing your search above and press return to search.
బెజవాడ బాలికలు!.. స్కూల్లో ఏం చేశారంటే!
By: Tupaki Desk | 19 Feb 2019 4:26 AM GMTవారిద్దరూ నిండా పదిహేనేళ్లు నిండని బాలికలు. ఇద్దరూ అక్కాచెల్లెళ్లే. బుద్ధిగా చదువుకోవాలని తల్లిదండ్రులు బడికి పంపితే... వారు మాత్రం స్కూల్ బ్యాగ్ తో పాట ఏకంగా మద్యంతో పాఠశాల కెళ్లే ఓ కొత్త అలవాటు చేసుకున్నారు. మద్యం బాటిళ్లను స్కూళ్లలోకి అనుమతించరు గదా. అందుకే వీరిద్దరూ మద్యంతో మిక్స్ చేసిన కూల్ డ్రింక్ బాటిళ్లను స్కూల్ కు తీసుకెళ్లేవారు. స్కూల్ బ్యాగు - చుడీదార్ లకుండే చున్నీల మధ్యన సదరు కూల్ డ్రింక్ బాటిళ్లను పట్టుకెళ్లేవారు.
ఇంకేం... టీచరు బోర్డు వైపు తిరిగి పాఠాలు చెబుతుంటే... చున్నీలే అడ్డుగా పెట్టుకుని కూల్ డ్రింకులో కలుపుకుని తెచ్చుకున్న లిక్కర్ ను సిప్ చేస్తూ పోయారు. బాడీలోకి వెళ్లిన లిక్కర్ ఊరికే ఉండదు కదా. బాడీలను షేక్ చేసింది. ఫలితంగా వీరు తమ పక్కన ఉన్న బాలికలపై తూలారు. తీరా వాసన పసిగడితే... లిక్కర్ వాసన వచ్చింది. స్టూడెంట్స్ ఈ విషయాన్ని టీచర్ కు చెబితే... టీచర్ దానిని హెడ్ మాస్టర్ కు చేరవేశారు. హెడ్ మాస్టర్ పిలుపుతో అప్పటికప్పుడే అక్కడ వైద్య నిపుణులు ప్రత్యక్షమైపోయారు. ఆ బాలికలకు పరీక్షలు చేశారు. మద్యం తాగినట్టుగా తేల్చారు.
ఇంకేముంది వారి తల్లిదండ్రులను పిలిపించేసిన హెడ్ మాస్టర్ ఇద్దరికీ టీసీలు ఇచ్చేశారు. మీరు స్కూల్లో ఉంటే ఇతరులకూ ఈ అలవాటు అవుతుందంటూ చాలా మర్యాదగా సాగనంపేశారు. ఇది ఎక్కడో విదేశాల్లోనే - పాశ్చాత్య సంస్కృతి ఎంట్రీ ఇచ్చిన మెట్రో సిటీల్లో చోటుచేసుకున్న ఘటన కాదు.నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతికి కూతవేటు దూరంలో ఉన్న విజయవాడ నగరానికి అతి సమీపంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో జరిగిన ఘటన ఇది. అందరినీ దిగ్భ్రాంతికి గురి చేసిన ఈ ఘటనలో సదరు బాలికలు తమ తండ్రి మద్యానికి బానిస అయితే... తండ్రిని దారిలో పెట్టడానికి బదులుగా వారే ఆ మద్యానికే బానసగా మారారట.