Begin typing your search above and press return to search.

7 వీడియోల్లో 2 వీడియోలు మార్ఫింగ్ చేశారు

By:  Tupaki Desk   |   2 March 2016 6:04 AM GMT
7 వీడియోల్లో 2 వీడియోలు మార్ఫింగ్ చేశారు
X
దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన ఢిల్లీ జేఎన్ యూ వర్సిటీలో చోటు చేసుకున్న వ్యవహారానికి సంబంధించిన కొత్త కోణం బయటకు వచ్చింది. దేశానికి వ్యతిరేకంగా పలువురు విద్యార్థులు నినాదాలు చేసినట్లుగా బయటకు వచ్చిన వీడియోల వాస్తవాన్ని సాంకేతికంగా నిగ్గు తేల్చేందుకు ఫోరెన్సిక్ పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల కోసం తొమ్మిది వీడియోలను హైదరాబాద్ పంపారు.

ఇలాంటి పంపిన వివాదాస్పద వీడియోలను హైదరాబాద్ కు చెందిన ఫోరెన్సిక్ అధికారులు పరిశీలించి.. విశ్లేషించారు. దీనికి సంబంధించి తాజాగా బయటకు వచ్చిన విశేషాలు చూస్తే.. పరీక్షకు మొత్తం 7 వీడియోలు రాగా.. అందులో 2 వీడియోలు ముందే ఎడిట్ చేసినట్లు గుర్తించినట్లు చెబుతున్నారు. అంతేకాదు.. ఈ రెండు వీడియోలు అసలైనవి కావని.. ఎడిట్ చేసి.. గొంతులు కలిపినట్లుగా గుర్తించినట్లు చెబుతున్నారు. వీడియోలో లేని వారి గొంతుల్ని కలిపినట్లు తాము గుర్తించినట్లుగా అధికారులు స్పష్టం చేస్తున్నారు.

దీనికి సంబంధించిన సమాచారాన్ని తాము ఉన్నతాధికారుల దృష్టికి నివేదిక రూపంలో పంపినట్లుగా చెబుతున్నారు. తాజాగా ఫోరెన్సిక్ అధికారుల నివేదికతో జేఎన్ యూ వ్యవహారం మరో మలుపు తిరగనుంది. దేశానికి వ్యతిరేకంగా నినాదాలు చేసినట్లు.. జాతి వ్యతిరేక వ్యాఖ్యలు చేసినట్లుగా కనిపిస్తున్న వీడియోలు నిజం కాకుంటే.. వాటిని అలా మార్చింది ఎవరు? ఇంత రచ్చకు కుట్ర పన్నింది ఎవరు? దాని వెనుక ఎవరు ఉన్నారు? అన్న ప్రశ్నలకు సమాధానం లభించాల్సి ఉంది.