Begin typing your search above and press return to search.
లాకప్ డెత్...ఇద్దరు కానిస్టేబుళ్లకు ఉరి!
By: Tupaki Desk | 25 July 2018 2:11 PM GMTదొంగతనం కేసులోనో... మరేదో కేసులోనో అనుమానితులను విచారణ పేరుతో పోలీసులు అదుపులోకి తీసుకోవడం....వారిని పోలీస్ స్టేషన్ లో ఇంటరాగేషన్ పేరుతో హింసించడం......ఆ తర్వాత అనుమానితులు......అనుమానాస్పద పరిస్థితులలో లాకప్ లోనే మరణించడం....ఆ తర్వాత కుటుంబ సభ్యులు, మానవహక్కుల సంఘం నేతల ఫిర్యాదుతో ....సదరు పోలీసులు పై కేసు నమోదవడం....కొన్నాళ్లకు ఆ కేసు అటకెక్కడం....ఇటువంటి సన్నివేశాల నేపథ్యంలో టాలీవుడ్ - బాలీవుడ్ - కోలీవుడ్ లలో వందల కొద్దీ సినిమాలు తెరకెక్కాయి. నిజ జీవితంలో అటువంటి ఘటనలు అనేకం ఉన్నాయన్నది అంగీకరించాల్సిన వాస్తవం. అయితే, ఇదే తరహాలో కేరళలో జరిగిన ఓ లాకప్ డెత్ కేసులో.....సీబీఐ ప్రత్యేక కోర్టు సినీ ఫక్కీలో నేడు సంచలన తీర్పు వెలువరించింది. ఓ యువకుడి లాకప్ డెత్ కేసులో ఇద్దరు పోలీసులకు మరణ శిక్ష విధిస్తూ బుధవారం నాడు చరిత్రాత్మక తీర్పునిచ్చింది. ఆ కేసుకు సంబంధించి ఐదుగురిని దోషులుగా నిర్ధారించిన కేరళ సీబీఐ కోర్టు...ఇద్దరికి మరణ శిక్ష విధిస్తూ ఇచ్చిన తీర్పు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైది. తన కొడుకు మృతికి కారణమైన వారికి శిక్షపడాలని 13 ఏళ్లుగా సుదీర్ఘ పోరాటం చేస్తోన్న బాధితుడి కన్నతల్లి... ఎట్టకేలకు విజయం సాధించారు.
2005లో కేరళలో ఉదయ్ కుమార్ అనే యువకుడిని దొంగతనం ఆరోపణలపై స్టేషన్ కు తీసుకువచ్చారు. అయితే, నాటకీయ పరిణామాల మధ్య ఉదయ్ లాకప్ హత్యకు గురవడం తీవ్ర సంచనలం రేపింది. తన కొడుకు ఉదయకుమార్ ను పోలీసులు అన్యాయంగా తీవ్రంగా హింసించి - హత్య చేశారని ఉదయకుమార్ తల్లి ప్రభావతి పిటిషన్ దాఖలు చేసింది. దీంతో - హైకోర్టు ఆదేశాల ప్రకారం....2007లో సీబీఐ దర్యాప్తు చేపట్టింది. తాజాగా, పోలీసు కానిస్టేబుళ్లు జితు కుమార్ - శ్రీ కుమార్ లు...ఉదయ్ ను లాకప్ డెత్ చేశారని తేలుస్తూ వారికి ఉరిశిక్ష విధించింది. దాంతోపాటు, 2 లక్షల రూపాయల జరిమానా చెల్లించాలని ఆదేశించింది. ఈ కేసులో సాక్ష్యాలను నాశనం చేయడం తదితర ఆరోపణల కింద సబ్ ఇన్ స్పెక్టర్ అజిత్ కుమార్ - సర్కిల్ ఇన్ స్పెక్టర్ ఇ.కె. సాబుతోపాటు అప్పటి అసిస్టెంట్ కమిషనర్ ఫోర్ట్ కే హరిదాస్ కు 3 సంవత్సరాల జైలు శిక్ష విధిస్తూ సంచలన తీర్పు వెలువరించింది. ఈ తీర్పుపై ప్రభావతి అమ్మ సంతృప్తి వ్యక్తం చేశారు. కంటిమీద కునుకులేకుండా 13 ఏళ్లుగా చేసిన పోరాటానికి ఫలితం దక్కిందన్నారు. ఈ తరహా క్రూరత్వానికి వ్యతిరేకంగా బాధితుల కుటుంబ సభ్యులు నిర్భయంగా పోరాడాలని పిలుపునిచ్చారు.