Begin typing your search above and press return to search.
అమెరికాలో కాల్పుల కలకలం.. ఇద్దరు మృతి
By: Tupaki Desk | 28 March 2019 6:10 AM GMTఅగ్రరాజ్యమైన అమెరికాలో కాల్పుల కలకలం మరోసారి చోటు చేసుకుంది. ఇటీవల కాలంలో అమెరికాలో కాల్పుల ఉదంతాలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. తాజాగా చోటు చేసుకున్న ఈ ఉదంతం సియోటెల్ పట్టణంలో చోటు చేసుకుంది. గుర్తు తెలియని ఆగంతుకుడు తుపాకీతో ఇష్టారాజ్యంగా కాల్పులకు తెగపడ్డారు.
ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా.. మరో ఇద్దరు తీవ్ర గాయాలకు గురయ్యారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు చెబుతున్నారు. ఇప్పటివరకూ అందిన సమాచారం ప్రకారం ఈశాన్య సియోటెల్ ప్రాంతానికి చెందిన దుండగుడు ఒకరు బుధవారం తుపాకీతో వీధుల్లోకి వచ్చాడు. కారులో ప్రయాణిస్తున్న మహిళను కిడ్నాప్ చేసే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో ఆమెపై తుపాకీతో కాల్పులు జరిపారు.
దీంతో.. ఆ మహిళ అక్కడికక్కడే కుప్పకూలిపోయింది. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ఆమెను ఆసుపత్రికి తరలించారు. ఆమె ఆరోగ్యం విషమంగా ఉన్నట్లు చెబుతున్నారు. మహిళపై కాల్పులు జరిపిన అతడు.. అక్కడి నుంచి తప్పించుకునే ప్రయత్నంలో అటువైపు వస్తున్న మెట్రో బస్సుపై కాల్పులకు తెగబడ్డాడు. దీంతో.. బస్సు డ్రైవర్ కు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో షాక్ కు గురైన బస్సు డ్రైవర్ వెంటనే రియాక్ట్ అయి.. బస్సును వేగంగా పక్కకు తీసుకెళ్లటంతో బస్సులోని 12 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు.
అనంతరం మరో కారుపై కాల్పులు జరిపిన ఆగంతుకుడి చర్యతో కారు డ్రైవర్ అక్కడిక్కడే మరణించారు. అతడి కారును తీసుకెళ్లే క్రమంలో మరో కారును బలంగా ఢీ కొట్టాడు. దీంతో.. ఆ వాహనంలోని వ్యక్తి ఘటనాస్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. ఇలా ఇష్టం వచ్చినట్లుగా వ్యవహరించిన ఆ దుండగుడిని భారీగా పోలీసులు రంగంలోకి దిగి వెంటాడి అతడ్ని అదుపులోకి తీసుకున్నారు. ఇంతకూ ఆ వ్యక్తి ఎవరు? ఎందుకింత విధ్వంసానికి పాల్పడ్డాడన్న విషయాలు బయటకు రావాల్సి ఉంది.