Begin typing your search above and press return to search.
ఆ ఇద్దరు ఆంటీలు ఒకరినొకరు లవ్ చేసుకొని..
By: Tupaki Desk | 7 July 2016 8:14 AM GMTసంప్రదాయవాదులకు కాస్త ఇబ్బందిగా అనిపించే కథనమిది. తమదైన ప్రపంచంలో బతికే వారికి ఇలాంటి ఉదంతాలు విన్నప్పుడు అసలు నిజంగా జరుగుతాయా? లేక ఇలాంటివి కల్పించి రాస్తారా? అన్న సందేహం కూడా కలిగే పరిస్థితి. మరికొందరైతే.. ఇలాంటి కథనాలు ఇవ్వకపోతే ఏమైందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తుంటారు. కానీ.. మన చుట్టూ ఉన్న ప్రపంచంలో జరుగుతున్న కొన్ని కీలక మార్పుల గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ కథనానికి ఏ మాత్రం సంబంధంలేని ఒక విషయాన్ని మూడు ముక్కల్లో ముగించి.. అసలు కథనంలోకి వెళ్లిపోదాం.
గతంలో పసిమొగ్గాల్లాంటి చిన్నారులపై అత్యాచారం అనే దారుణం మనకేమాత్రం పరిచయం లేదు. కానీ.. ఇటీవల కాలంలో తరచూ వింటున్నాం. ఇలాంటి వార్తలు నెగిటివ్ ధోరణి పెంచుతుందని కొందరు చెబుతుంటారు. కానీ.. మరికొందరి మాట ఇంకోలా ఉంటుంది. అదేమంటే.. ఈ తరహా వార్తలు ప్రచురించటం ద్వారా.. బయట పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఇలాంటివి మన దరికి చేరకుండా ఉండటానికి ఎంత అప్రమత్తంగా ఉండాలన్న విషయాన్ని ఈ వార్తలు చెప్పకనే చెబుతుంటాయి.
ఇక.. అసలు వార్తలోకి వెళ్లే ముందు ఇంకో మాటేమిటంటే.. ఇలాంటి కథనాలు ఇవ్వటానికి కారణం.. సామాజికంగా వస్తున్న మార్పులపై అవగాహన కోసమేనన్న విషయాన్ని గుర్తించాల్సిన అవసరం ఉంది. సినిమాటిక్ గా ఉంటూ.. షాకుల మీద షాకులిచ్చేలా సాగుతూ ఉండే ఈ రియల్ కథ రాజస్థాన్ లోని టోన్క్ జిల్లాలోని అమ్లీ అనే గ్రామంలో చోటు చేసుకుంది. ఆ ఇద్దరు మహిళలకు ఎనిమిదేళ్ల కిందట పెళ్లి అయ్యింది. ఇద్దరికి భర్తలు ఉన్నారు. ఇరుగుపొరుగు ఇళ్లల్లో ఉంటున్నారు. వారిలో ఒకరు సోనియా. ఆమెకు 27 ఏళ్లు. మరో మహిళ పేరు మమత. ఆమె వయసు 26 ఏళ్లు. ఇద్దరికి చెరో సంతానం కూడా ఉంది. వీరిద్దరి భర్తలు రోజువారీ పనుల్లో భాగంగా విధులకు వెళుతుంటారు.
దీంతో.. సోనియా.. మమతల మధ్య స్నేహం పెరిగి.. అనూహ్యంగా అదో అనుబంధంగా మారింది. ఇద్దరూ కలిసి పెళ్లి చేసుకొని బతకాలని డిసైడ్ అయ్యారు. పెళ్లి అయి పిల్లలు ఉండి.. భర్తలతో ఉన్న ఇద్దరు మహిళలు పెళ్లి అంటే ఒప్పుకునే ఛాన్స్ లేని నేపథ్యంలో ఇంటి నుంచి పారిపోయి పెళ్లి చేసుకొని తమ బతుకులు తాము బతకాలని నిర్ణయించుకున్నరు. అనుకున్నట్లే వీరిద్దరూ వెళ్లిపోయి పెళ్లి చేసుకొని కాపురం పెట్టేశారు. వాళ్లు పెళ్లి కోసం చేసుకున్న ఒప్పందంలో భాగంగా సోనియా భర్తగా.. మమత భార్యగా ఫిక్స్ అయ్యింది.
ఇళ్ల నుంచి వదిలి వెళ్లిన వీరి గురించి వెతికే పనిలో పడ్డాడు మమత బ్రదర్. చివరకు ఆర్నెల్ల ప్రయత్నం తర్వాత వీరిద్దరి వ్యవహారాన్ని అతడు గుర్తించాడు. వారి దగ్గరకు వెళ్లి.. రెండు కుటుంబాలు వారిని ఒక్కటి చేసే విషయంలో ఓకే అన్నారని.. తనతో రావాలని నమ్మించాడు. నమ్మి.. ఊరికి వచ్చిన వారిని ఇద్దరు మహిళల అత్తలు కలిసి పిచ్చ కొట్టుడు కొట్టేశారు. భర్తగా చెప్పుకునే సోనియాగా బాగా కొట్టి ఊరి నుంచి తరిమేశారు. ఇది జరిగిన కొన్నాళ్లకు భార్యగా చెప్పుకునే మమత మాయమైంది.
తన భాగస్వామి అయిన మమత కోసం సోనియా వెతుకుతోంది. ఎంత ప్రయత్నించినా ఆమె వివరాలు లభించకపోవటంతో ధైర్యం సడలి చివరకు డిగ్గి పోలీస్ స్టేషన్ కు వెళ్లి కంప్లైంట్ చేసింది. అక్కడా వాతావరణం సానుకూలంగా లేకపోవటంతో స్వలింగ వివాహాలు చెల్లుతాయని.. న్యాయసాయం కోసం కోర్టు మెట్లు ఎక్కటంతో ఈ విచిత్రమైన రియల్ స్టోరీ బయటకు వచ్చింది. తన భార్యగా చెప్పుకునే మమత ఆచూకీ లభించకపోతే తాను ఆత్మహత్య చేసుకుంటానని.. తను లేకుండా బతకలేనని సోనియా చెబుతోంది. మమత ఏమైంది? అన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. ఆమె ఆచూకీ తెలవాల్సి ఉంది.