Begin typing your search above and press return to search.

బ్రేకింగ్ : తెలంగాణ మరో 2 కరోనా కేసులు..మొత్తం ఎన్నంటే ?

By:  Tupaki Desk   |   20 March 2020 11:10 AM GMT
బ్రేకింగ్ : తెలంగాణ మరో 2 కరోనా కేసులు..మొత్తం ఎన్నంటే ?
X
కరోనా కల్లోలానికి ప్రపంచదేశాలు వణికిపోతున్నాయి. ప్రపంచదేశాలు ఈ మహమ్మారి వ్యాప్తి నివారణకు ఎన్ని జాగ్రత్త చర్యలు చేపడుతున్నా కూడా కరోనా వైరస్‌ బారిన పడే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే పోతుండటం తో అందరిలో ఆందోళన పెరిగిపోతుంది. ముఖ్యంగా మనదేశంలో కరోనావైరస్ వేగంగా విస్తరిస్తోంది. ఇప్పటివరకు భారత్‌ లో 209 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి.

ఇక తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకూ పెరగుతున్నాయి. తాజాగా నేడు మరో రెండు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. లండన్ నుంచి వచ్చిన ఇద్దరు భారతీయులకు కరోనా సోకినట్లు పరీక్షల్లో తేలింది. ప్రస్తుతం వారిద్దరిని గాంధీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు తెలంగాణ మంత్రి ఈటల రాజేందర్ వెల్లడించారు. దీనితో మొత్తం తెలంగాణ లో పాజిటివ్ కేసుల సంఖ్య 18కు చేరుకుంది. వీరిలో ఒకరు ఇప్పటికే డిశ్చార్జి కాగా.. మరో 17 మంది చికిత్స పొందుతున్నారు. తెలంగాణ లో ఉన్న కరోనా బాధితుల్లో ఏకంగా 9 మంది విదేశీయులు ఉండడం గమనార్హం.

ఇక రాష్ట్రంలో వేగంగా కరోనా విస్తరిస్తుండటంతో ..ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం పలు కఠినమైన నిర్ణయాలు తీసుకుంది. ఇప్పటికే విద్యాసంస్థలు, బార్లు, జిమ్‌లు, పార్క్‌లు, థియేటర్లు మూతపడ్డాయి. హైకోర్టు ఆదేశాలతో పదో తరగతి పరీక్షలు కూడా వాయిదా పడ్డాయి. కరోనా నేపథ్యంలో వృద్ధులు, చిన్నపిల్లలను బయటకు రానీయవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేసింది రాష్ట్ర ప్రభుత్వం. సోషల్ డిస్టెన్స్ , వ్యక్తిగత శుభ్రత పాటిస్తే ఈ వ్యాధి రాకుండా నివారించవచ్చని సూచించింది. కరోనాను ఈజీగా తీసుకుంటే భారీ మూల్యం తప్పదని హెచ్చరిస్తుంది.