Begin typing your search above and press return to search.
కర్నూలులో కరోనా కలకలం..మరో ఇద్దరు వైద్యులకు పాజిటివ్!
By: Tupaki Desk | 25 April 2020 11:30 AM GMTఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు జిల్లాలో కరోనా వైరస్ కేసులు అంతకంతకు పెరుగుతున్నాయి. ఇప్పటివరకు కర్నూలు జిల్లాలో 275 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. జిల్లాలో కొత్తగా ఇద్దరు డాక్టర్లకు కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో కరోనా బారిన పడ్డ డాక్టర్ల సంఖ్య ఆరుకు చేరింది. ఇప్పటివరకు జిల్లావ్యాప్తంగా ఎనిమిది మంది మరణించారు. ఏపీలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1016కు చేరింది. వీరిలో171 మంది ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 814గా ఉంది. కరోనా కారణంగా ఏపీలో ఇప్పటివరకు 31 మంది చనిపోయారు.
ప్రస్తుతం నమోదైన కేసులో కర్నూలు, నంద్యాల, నందికొట్కూరు ప్రాంతాలలో నమోదైనట్లు వైద్య ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. కర్నూలు జిల్లాలో పుట్టగొడుగుల్లా కరోనా వైరస్ కేసులు నమోదు అవుతుండడంతో ప్రజల్లో భయందోళన అధికమవుతుంది. కరోనా పాజిటివ్ బాధితుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉండటం తో అధికారులు అప్రమత్తమైయ్యారు. ముఖ్యంగా కర్నూలు జిల్లాలో ఇప్పటికే 50కి పైగా రెడ్ జోన్ ప్రాంతాలను గుర్తించారు. వీటిలో 19 హై రిస్కు జోన్ లని గుర్తించి ఆయా ప్రాంతాల్లో జన సంచారం లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఎవరైనా బయటికి వచ్చిన అక్కడికి అక్కడే కేసులు నమోదుచేసి, సంబంధిత వారి వాహనాలను సీజ్ చేస్తున్నారు. ఇప్పటివరకు జిల్లాలో దాదాపు మూడువేల వాహనాలకు పైగా సీజ్ చేశారు. వీటికి జరిమానా రూపంలో రూ. 2. 5 కోట్లు సమకూరింది.