Begin typing your search above and press return to search.

పారాలింపిక్స్‌ లో భారత్‌ కి మరో రెండు పతకాలు !

By:  Tupaki Desk   |   4 Sep 2021 7:00 AM GMT
పారాలింపిక్స్‌ లో భారత్‌ కి మరో రెండు పతకాలు !
X
టోక్యో వేదికగా జరుగుతోన్న పారాలింపిక్స్‌ లో భారత్‌ కి పతకాల పంట పడుతోంది. ఇప్పటి వరకు 14 పతకాలు భారత్‌ ఖాతాలో చేరగా తాజాగా మరో రెండు పతకాలు వచ్చి చేరాయి. శనివారం జరిగిన షూటింగ్‌ లో భారత్‌ కు రెండు పతకాలు దక్కాయి. మిక్స్‌డ్‌ 50 మీటర్స్‌ పిస్టల్‌ విభాగంలో మనీష్‌ నర్వాల్‌ మొదటి స్థానంలో నిలిచి పసిడి పతకాన్ని సొంతం చేసుకున్నాడు. దీంతో భారత్‌ ఖాతాలో గోల్డ్‌ మెడల్స్‌ సంఖ్య మూడుకి చేరింది.

ఇక భారత్‌కు చెందిన మరో ప్లేయర్‌ సింగ్‌ రాజ్‌ సిల్వర్‌ పతకాన్ని గెలుచుకున్నాడు. ఇదిలా ఉంటే శనివారం జరిగిన మ్యాచ్‌ లో భారత షట్లర్ ప్రమోద్ భగత్ ఫైనల్‌ కు చేరిన విషయం తెలిసిందే. పురుషుల సింగిల్స్ ఎస్ ఎల్ 3 సెమీ ఫైనల్‌ లో భారత షట్లర్ ప్రమోద్ భగత్ 21-11, 21-16 తేడాతో జపాన్‌కు చెందిన డైసుకే ఫుజిహారాను ఓడించి ఫైనల్లోకి చేరాడు. ఫైనల్లో గెలిస్తే ప్రమోద్‌ కి పసిడి దక్కనుంది. పారాలింపిక్స్‌లో ప్రమోద్ ఆడుతుండటం ఇదే తొలిసారి.

గోల్డ్‌ మెడల్‌ కైవసం చేసుకున్న మనీష్ నర్వాల్‌ కు రూ .6 కోట్లు, రజత పతకం సాధించిన సింఘ్‌ రాజ్‌ అధనాకు రూ.4 కోట్లు రివార్డు ను ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ప్రకటించారు.ప‌త‌కాలు గెలిచిన ఈ ఇద్ద‌రికీ ప్ర‌భుత్వ ఉద్యోగాలు కూడా ఇవ్వ‌నున్న‌ట్లు హ‌ర్యానా స‌ర్కార్ ప్రకటించింది. కాగా అ‍ంతకముందు పారాలింపిక్స్‌లో జావెలిన్ త్రోలో బంగారు పతకం సాధించి ప్రపంచ రికార్డు సృష్టించిన సుమిత్ ఆంటిల్‌కు సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ రూ .6 కోట్ల నగదు బహుమతిని ప్రకటించారు. డిస్కస్ త్రో ఎఫ్ -56 లో రజత పతకం సాధించినందుకు యోగేష్ కథునియాకు కూడా రూ. 4 కోట్ల రివార్డును ఆయన ప్రకటించారు. ఈ ఇద్దరు అథ్లెట్లకు ప్రభుత్వ ఉద్యోగాలు కూడా ఇస్తున్నట్లు హ‌ర్యానా ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. పారాలింపిక్స్‌ లో భారత్‌ కు ఖాతాలో మరో రెండు పతకాలను చేర్చిన మనీష్‌, సింగ్‌ రాజ్‌ కు ప్రధాని మోడీ శుభాకాంక్షలు తెలిపారు. ఇండియాకు పతకాలను తెచ్చి పెట్టిన ఇద్దరు ప్లేయర్స్‌ కు శుభాకాంక్షలు తెలిపారు.