Begin typing your search above and press return to search.

మరో రెండు కొత్త వేరియంట్లు.. పిల్లలకు మరింత ప్రమాదకరం!

By:  Tupaki Desk   |   23 May 2021 2:30 AM GMT
మరో రెండు కొత్త వేరియంట్లు.. పిల్లలకు మరింత ప్రమాదకరం!
X
కరోనా వైరస్ కరాళ నృత్యం చేస్తోంది. మహమ్మారి కాటుకు ఎంతో మంది బలవుతున్నారు. కాగా ఏటా ఇలాంటి ఎన్నో వైరస్ లు విజృంభిస్తాయని వైద్య నిపుణులు అంటున్నారు. కానీ వాటి ప్రభావం స్వల్పంగా ఉండేదని అన్నారు. అధిక తీవ్రత కారణంగా కొవిడ్ ప్రపంచ మహమ్మారిగా మారిందని పేర్కొన్నారు. కాగా మరో రెండు కొత్త వైరస్ లను గుర్తించినట్లు పరిశోధకులు తెలిపారు.

మనుషులకు సోకే ప్రమాదమున్న రెండు కొత్త వేరియంట్లను కొన్ని నెలల కిందటే గుర్తించినట్లు నిపుణులు పేర్కొన్నారు. కుక్కల్లో కనిపించే రకమైన కరోనా వైరస్ ను మలేషియాకు చెందిన బాధితుల్లో గుర్తించినట్లు తెలిపారు. ఎనిమిది పిల్లల్లో న్యూమోనియా లక్షణాలు ఉండగా వారికి వైద్య పరీక్షల్లో చేసినట్లు తెలిపారు. పిల్లల శరీరంలో మరో కొత్త వైరస్ ఉందని చెప్పారు. అనంతరం స్థానిక ఆస్పత్రుల్లో చికిత్స పొంది వారు కోలుకున్నారని వివరించారు.

కరోనా జాతికి చెందిన ఏడు రకాల వైరస్ మనుషులకు సోకుతున్నాయి. వాటిలో కొన్ని ప్రమాదకరంగా ఉండగా.. మరికొన్ని స్వల్ప అనారోగ్యానికి గురిచేస్తాయని తెలిపారు. సార్స్ 1, సార్స్ 2, మెర్స్ వైరస్ లు చాలా ప్రమాదకరమని చెబుతున్నారు. కొత్తగా కనుగొన్న వైరస్ లు మనిషి నుంచి మనిషిలోకి ప్రవేశించగలవనడానికి ఇప్పటికి వరకు ఆధారాలు లేవని స్పష్టం చేశారు. మలేషియాలో గుర్తించిన వైరస్ పిల్లలు, పందులకు సోకిందని చెప్పారు. ఇది జంతువుల నుంచే వ్యాపిస్తుందని అభిప్రాయపడుతున్నారు.

కొత్త రకం వైరస్ ను ఓ సాంప్రదాయ తెగకు చెందిన వారిలో గుర్తించినట్లు పరిశోధకులు తెలిపారు. వారు జంతువులకు చాలా దగ్గరగా ఉంటారని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో పెంపుడు జంతువులతో సన్నిహితంగా మెలగడం వల్లే ఈ వైరస్ సంక్రమించి ఉంటుందని అనుమానిస్తున్నారు. ఈ రకానికి చెందిన వైరస్ లు పిల్లి, కుక్క, పందులు వంటి మాంసాహార జంతువుల నుంచి వ్యాపిస్తాయని అంటున్నారు. జంతువుల మాంసం విక్రయించే ప్రాంతాల్లో సోకుతాయని పేర్కొన్నారు.

ఆల్ఫా కొత్తరకం కరోనా వైరస్ పిల్లలకు మాత్రమే సోకుతుందని నిపుణులు అంటున్నారు. పెద్దవారిలో దీనిని ఎదుర్కొనే వ్యాధి నిరోధక శక్తి ఉంటుందని తెలిపారు. అందుకే దీనితో పిల్లలకు ప్రమాదకరంగా మారే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. ఈ వైరస్ లపై మరిన్ని ప్రయోగాలు జరగాల్సి ఉన్నాయని వివరించారు.