Begin typing your search above and press return to search.

ఏపీ ఎన్నిక‌ల్లో మ‌రో రెండు పార్టీలు.. ఏవంటే..!

By:  Tupaki Desk   |   27 Oct 2021 3:45 AM GMT
ఏపీ ఎన్నిక‌ల్లో మ‌రో రెండు పార్టీలు.. ఏవంటే..!
X
ఏపీలో ఎప్పుడు ఎన్నిక‌లు జ‌రిగినా.. మ‌రో రెండు పార్టీలు ఇక్క‌డ నుంచి పోటీ చేసేందుకు రెడీగా ఉన్నాయా ? అంటే.. ఔన‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు. దీంతో ఎన్నిక‌లు ఎప్పుడు జ‌రిగినా.. ఏపీలో భారీగా పోటీ ఉంటుంద‌ని.. ఓట్లు చీలిక‌లు.. పేలిక‌లు కావ‌డం ఖాయ‌మ‌నే అంచ‌నాలు కూడా వ‌స్తున్నాయి. కులాలు మ‌తాల వారీగా.. సామాజిక వ‌ర్గాల వారీగానే కాకుండా.. ఇక‌ పై.. మ‌రిన్ని రూపాల్లో ఓట్లు చీల‌తాయ‌ని చెబుతున్నారు. దీనికి ప్ర‌ధాన కార‌ణం.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఏపీలో పోటీకి పొరుగు రాష్ట్ర మైన తెలంగాణ నుంచి రెండు పార్టీ త‌హ‌ త‌హ‌లాడుతున్నాయి.

ఇప్ప‌టికే ఏపీలో తామ‌ర తంప‌ర‌గా పార్టీలు ఉన్నాయి. ప్ర‌ధాన పార్టీలు.. అధికారంలో ఉన్న వైసీపీ, ప్ర‌ధాన ప్ర‌తిపక్షంగా ఉన్న టీడీపీకి తోడు.. మ‌రో కీల‌క పార్టీ జ‌న‌సేన ఉన్నాయి. వీటితో పాటు.. సీపీఐ, సీపీఎం, ఆప్‌, బీఎస్పీ, బీజేపీ ఇలా.. చిన్న చిత‌క పార్టీలు ఉన్నాయి. మ‌రో ముఖ్య పార్టీ కాంగ్రెస్ కూడా ఉంది. ఇప్ప‌టికే గ‌త ఎన్నిక‌ల‌లో ఈ పార్టీ ల‌న్నీ .. పోటీ చేశాయి. వీటితో పాటు మ‌రో రెండు మూడు స్వ‌తంత్ర పార్టీలు కూడా రంగంలోకి దిగే అవ‌కాశం ఉంది. ఇప్పుడు వీటితో పాటు.. పొరుగున ఉన్న తెలంగాణ అధికార పార్టీ.. టీఆర్ ఎస్‌.. దీంతో పాటు.. హైద‌రాబాద్ కేంద్రంగా ఉన్న మజ్లిస్ పార్టీ కూడా.. ఏపీలో పోటీకి రెడీ అవుతున్నాయి.

ఏపీ ప్ర‌జ‌లు త‌మ‌ను కోరుకుంటున్నారంటూ.. తెలంగాణ అధికార పార్టీ అధినేత కేసీఆర్ ప్ర‌క‌టించారు. సో.. ఆయ‌న వ్యూహాత్మ‌కం గా అడుగులు వేయ‌గ‌లిగితే.. తెలంగాణ స‌రిహద్దు జిల్లాల్లోని నియోజ‌క‌వ‌ర్గాల్లో టీఆర్ ఎస్ పోటీ చేసే అవ‌కాశం ఉంది. అదే విధంగా.. కేసీఆర్ పూర్వీకులు ఉన్నార‌ని.. చెప్పుకొనే శ్రీకాకుళం.. చుట్టు ప‌క్కల జిల్లాలైన విజ‌య‌న‌గ‌రం, విశాఖ‌లోనూ పోటీ చేసే అవ‌కాశం ఉంది. ఇక్క‌డ గెలిచేందుకు హైద‌రాబాద్‌ తో లింకులు ఉన్న ఏపీకి చెందిన పారిశ్రామిక వేత్త‌ల‌ను వినియోగించుకునే అవ‌కాశం ఉంద‌ని చెబుతున్నారు. సో.. ఈ పార్టీ బ‌లంగా నిర్ణ‌యించుకుంటే.. ఖ‌చ్చితంగా గ‌ట్టిపోటీ ఉంటుంది.

ఇక‌, అస‌దుద్దీన్ నేతృత్వంలోని ఎంఐఎం.. మ‌జ్లిస్ పార్టీ గ‌త ఎన్నిక‌ల్లోనే తాము పోటీ చేయాల‌నుకున్నా మ‌ని.. కొన్నాళ్ల కింద‌ట చెప్పు కొచ్చారు. ఇటీవ‌ల కాలంలో పార్టీని దేశ‌వ్యాప్తంగా విస్త‌రించాల‌ని నిర్ణ‌యించు కున్న నేప‌థ్యంలో మ‌జ్లిస్‌.. పోటీచేసే అవ‌కాశం ఉంది. ముస్లిం జ‌నాభా ఎక్కువ‌గా ఉన్న క‌ర్నూలు స‌హా.. అనంత‌పురం, క‌డ‌ప‌, గుంటూరు, విజ‌య‌వాడ‌ ల్లో ఎంఐఎంకు ఛాన్స్ ఉంది. సో.. అటు.. స‌రిహ‌ద్దు జిల్లాల్లో టీఆర్ఎస్‌, ఇటు ముస్లిం జ‌నాభా ఎక్కువ‌గా ఉన్న నియోజ‌క‌వ‌ర్గాల్లో ఎంఐఎం పోటీ చేస్తే.. స్థానికంగా ఏపీ లో ఉన్న పార్టీల‌కు ఇబ్బందులు త‌ప్ప‌వ‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు.