Begin typing your search above and press return to search.
తెలుగుదేశంలో మరో ఇద్దరు వైకాపా ఎమ్మెల్యేలు!
By: Tupaki Desk | 13 April 2016 4:01 AM GMTవైఎస్సార్ కాంగ్రెస్ పార్టీనుంచి తెలుగుదేశంలోకి ఎమ్మెల్యేల వలసల పరంపర నిరాటంకంగా కొనసాగుతూనే ఉన్నది. తాజాగా మరో ఇద్దరు ఎమ్మెల్యేలు తెలుగుదేశంలో చేరబోతున్నట్లుగా సమాచారం. ఒక ఎమ్మెల్యే తరఫున ఆయన సోదరులు చంద్రబాబుతో సమావేశమై చేరికకు ముహూర్తం నిర్ణయించుకోవడం ద్వారానూ, మరో ఎమ్మెల్యే రాకను వ్యతిరేకిస్తూ ఆయన స్థానిక ప్రత్యర్థులు పార్టీ ప్రధాన కార్యదర్శి లోకేశ్ కు నివేదించడం ద్వారాను ఈ రెండు ఫిరాయింపులకు సంబంధించిన వార్తలు వెలుగులోకి వచ్చాయి. తాజాజాబితాగా.. విజయనగరం జిల్లా బొబ్బిలి ఎమ్మెల్యే సుజయకృష్ణ రంగారావు - ప్రకాశం జిల్లా గిద్దలూరు ఎమ్మెల్యే అశోక్ రెడ్డి తెదేపాలో చేరబోతున్నారని వినికిడి.
పార్టీనుంచి ఎమ్మెల్యేలు ఎవ్వరూ కట్టు తప్పిపోకుండా కాపాడుకోవడానికి వైకాపా అధినేత వైఎస్ జగన్మోహనరెడ్డి చేస్తున్న ప్రయత్నాలు ఏమీ పెద్దగా ఫలిస్తున్నట్లు కనిపించడం లేదు. సుజయకృష్ణ రంగారావు వైకాపా స్థానిక రాజకీయాల్లో మారిన సమీకరణాల దృష్ట్యా తెదేపా వైపు చూస్తున్నట్లు చాలా కాలంగా ప్రచారంలో ఉంది. అయితే తాజాగా మంగళవారంనాడు ఆయన, తన సోదరుడు బేబినాయనతో సహా విజయవాడలో చంద్రబాబునాయుడును కలిశారు. ఈనెల 15 లేదా 17లలో ఒక తేదీని చంద్రబాబు ఫైనలైజ్ చేస్తే.. ఆ ముహూర్తానికి వచ్చేస్తాం అని వారు కోరినట్లుగా తెలుస్తున్నది. బొత్స వైకాపాలోకి వచ్చినప్పటినుంచి ఆ పరిణామం పట్ల విముఖంగా ఉన్న సుజయకృష్ణ రంగారావు తన నియోజకవర్గంలో మొత్తం వైకాపా కేడర్ తో సహా చేరబోతున్నట్లు సమాచారం.
ప్రకాశం జిల్లా గిద్దలూరు ఎమ్మెల్యే అశోక్ రెడ్డి కూడా తెదేపాలో చేరబోతున్నారు. ఆయన చేరిక గురించి స్థానికంగా బాగా బయటకు పొక్కడంతో.. అక్కడి తెలుగుదేశం శ్రేణులు మూకుమ్మడిగా వచ్చి లోకేశ్ ను కలిసి అశోక్ రెడ్డి రాకను వ్యతిరేకించినట్లు వార్తలు వచ్చాయి. అయితే పార్టీని బలోపేతం చేసుకోవడానికి ఎవరు వచ్చినా సరే చేర్చుకోవడమే.. అంటూ పార్టీ నాయకులు చెప్పినట్లుగా తెలుస్తోంది. మీకు సరైన అవకాశాలు చూస్తాం అని మాత్రం చెబుతున్నారు. దీంతో అశోక్ రెడ్డి చేరిక దాదాపు ఖరారు అయిపోయినట్లే.
వైకాపాలో ఇంకా మరి కొందరు ఎమ్మెల్యేలు కూడా తెదేపాలోకి రావడానికి మంతనాలు సాగిస్తున్నట్లుగా తెలుస్తోంది. పార్టీ అధినేత వ్యక్తిగత భేటీలు జరుపుతున్న ఎమ్మెల్యేలు కూడా కొన్ని రోజుల వ్యవధిలోనే ఫిరాయించేస్తుండడం విశేషం.