Begin typing your search above and press return to search.

టీ 20 ప్ర‌పంచ‌క‌ప్‌ కు రెండు కొత్త జ‌ట్లు

By:  Tupaki Desk   |   29 Oct 2019 6:32 AM GMT
టీ 20 ప్ర‌పంచ‌క‌ప్‌ కు రెండు కొత్త జ‌ట్లు
X
పొట్టి క్రికెట్... క్రికెట్‌ను విశ్వవ్యాప్తం చేసేసింది. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా చాలా చిన్న చిన్న దేశాలు సైతం టీ 20 క్రికెట్‌లో సత్తా చాటుతున్నాయి. ఇంకా చెప్పాలంటే టెస్ట్ హోదా ఉన్న పెద్ద దేశాలకు సైతం సాధ్యం కానీ రికార్డులను చిన్న చిన్నటీంల‌తో పాటు ఆ టీంల‌కు చెందిన ఆటగాళ్లు సాధిస్తున్నారు. తాజాగా వచ్చే ఏడాది ఆస్ట్రేలియాలో జరిగే టీ 20 ప్రపంచకప్ అర్హత పోటీలు ప్రస్తుతం జరుగుతున్నాయి. మొత్తం 14 దేశాలు తలపడుతున్న అర్హత పోటీల్లో రెండు కొత్త జట్లు ప్రపంచక‌ప్‌కు అర్హత సాధించాయి.

ఈ ప్రపంచకప్ వచ్చే ఏడాది అక్టోబర్ 18 నుంచి ఆస్ట్రేలియాలో ప్రారంభం కానుంది. ఈ క‌ప్ ఫైన‌ల్ న‌వంబ‌ర్‌ 15న జరుగుతుంది. ఈ టోర్నమెంట్లో పాల్గొనేందుకు ఐర్లాండ్, పపువా న్యూగినియా అర్హత సాధించాయి. ప‌పువా న్యుగినియా కెన్యాతో జ‌రిగిన మ్యాచ్‌లో 45 ప‌రుగుల తేడాతో గెలిచి క‌ప్‌న‌కు అర్హ‌త సాధించింది. కాగా స్కాట్లాండ్ - నెదర్లాండ్ జట్ల మధ్య జరిగిన మరో మ్యాచ్లో నెద‌ర్లాండ్ ఓడిపోవడంతో మెరుగైన రన్‌రేట్ ఆధారంగా పపువా న్యూగినియా ప్రపంచకప్‌కు అర్హత సాధించింది.

ఇక మరో 4 జ‌ట్లు సైతం ఈ అర్హత పోటీల్లో విజయం సాధించి ప్రపంచక‌ప్‌లో పాల్గొన‌నున్నాయి. ఈ ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా, భారత్, పాకిస్థాన్, ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, వెస్టిండీస్, ఆఫ్ఘనిస్థాన్, శ్రీలంక, బంగ్లాదేశ్ తదితర మొత్తం 16 జట్లు తలపడనున్నాయి. క్రికెట్‌ను మ‌రింత‌గా విస్త‌రించాల‌న్న లక్ష్యంతో ఐసీసీ టి 20 ప్రపంచకప్‌లో ఏకంగా 16 దేశాలు పాల్గొనేలా షెడ్యూల్ రూపొందించారు.