Begin typing your search above and press return to search.

అంబానీ ఇంటికి కడియం మొక్కలు .. ధర తెలిస్తే షాక్ అవుతారు !

By:  Tupaki Desk   |   26 Nov 2021 4:53 AM GMT
అంబానీ ఇంటికి కడియం మొక్కలు .. ధర తెలిస్తే షాక్ అవుతారు !
X
ప్రముఖ వ్యాపారవేత్త, రిలయన్స్ అధినేత ముఖేశ్‌ అంబానీ ఇంటికి తూర్పుగోదావరి జిల్లా కడియం చెట్లు వెళ్లాయి. గుజరాత్‌ లోని జామనగర్‌ లో అంబానీ నిర్మించే ఇంటి ఆవరణలో నాటేందుకు ఇక్కడి నుంచి రెండు ఆలివ్‌ చెట్లను తీసుకెళ్లారు. గురువారం రాత్రి ట్రాలీలో తరలించారు. ఒక్కో చెట్టు రూ.22 లక్షలని, రవాణాకు రూ.3 లక్షలు ఖర్చు అదనం.

గౌతమి నర్సరీ నుంచి ఈ చెట్లు పంపిస్తున్నారు. ఈ చెట్లను గతంలో స్పెయిన్‌ లో నుంచి తెచ్చామని నర్సరీ అధినేత మార్గాని వీరబాబు తెలిపారు. చాలా ఏళ్లుగా ప్రత్యేక శ్రద్ధతో పెంచగా ఇంత ధర దక్కిందన్నారు.

ఇక చెట్లు అంబానీ ఇంట్లో కనువిందు చేయనున్నాయి. ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గుజరాత్‌ రాష్ట్రం జామనగర్‌లో నిర్మించే ఇంటి ఆవరణలో ఉంచేందుకు కడియం నర్సరీ నుంచి రెండు ఆలీవ్‌ చెట్లను రూ.50లక్షలకు అంబానీ కంపెనీ ప్రతినిధులు కొనుగోలు చేశారు.

వీటిని ప్రత్యేక ట్రాలీలో తరలించారు. గుజరాత్ రాష్ట్రం జామనగర్ లో అంబానీ నిర్మించే ఇంటి ఆవరణలో ఈ రెండు మొక్కలు కనువిందు చేయనున్నాయి.

సువిశాలమైన గార్డెన్ లో ఈ మొక్కలు ఉంటే వచ్చే అందమే వేరు. ఇన్ని ప్రత్యేకతలు కలిగిన ఈ మొక్కల రేటు ఆకాశాన్ని తాకేలా ఉంది. ఒక్కొక్క మొక్క పాతిక లక్షల రూపాయలు. అంటే రెండు మొక్కలు అర కోటి. వీటిని స్పెయిన్ నుంచి ఓడలో ప్రత్యేక కంటైనర్ ద్వారా లక్షలాది రూపాయల పెట్టుబడితో తీసుకొచ్చారు.

అనంతరం వాటికి గోదావరి మట్టి, నీళ్లతో ప్రత్యేక పోషణచేపట్టి కొత్త రూపురేఖలు సృష్టించిన తర్వాత ఇంత రేటు పలికింది. ఈ అరకోటి రూపాయలతో అంబానీ ఇంటికి ఈ మొక్కలు వెళ్లిపోయాయి. ఈ రెండు మొక్కలు కోసం ప్రత్యేక ట్రాలీని ఏర్పాటు చేశారు. దాని కిరాయి సుమారు మూడున్నర లక్షలు ఉంటుంది.

ఈ మొక్కల రేటు మాటెలా ఉన్నా చాలా కాలంగా పెంచిన మొక్కలు తరలిపోతుంటే ఆ నర్సరీ రైతు వీరబాబే గాక ఆ మొక్కలతో అనుబంధం ఉన్న ఉద్యోగులు, కూలీలలో కొంచెం భాద కనిపించింది. ట్రాలీపై మొక్కలను ఏర్పాటు చేసిన తరువాత అక్కడ పని చేసే వారందరు కలిసి ఫొటోలు తీయించుకున్నారు.