Begin typing your search above and press return to search.

అక్కాచెల్లెళ్ల 24ఏళ్ల పోరాటం..ఫలించింది..

By:  Tupaki Desk   |   15 May 2019 4:19 AM GMT
అక్కాచెల్లెళ్ల 24ఏళ్ల  పోరాటం..ఫలించింది..
X
తండ్రి భారతీయుడు.. తల్లి పాకిస్తానీ.. వీరిద్దరూ 1989లో పెళ్లి చేసుకున్నారు. పాకిస్తాన్ లోని కరాచీలో ఉండే ఈ జంటకు ఇద్దరు అమ్మాయిలు పుట్టారు. వారు కుటుంబంతోపాటు 1995లో ఇండియాకు వచ్చారు. 24 ఏళ్లుగా భారత్ లోనే ఉంటూ చదువుకుంటూ కూడా తాము పాకిస్తానీలమంటూ రాస్తున్నారు. కలెక్టర్ కు, ప్రధాని కార్యాలయం సహా అంతటా తిరిగినా ఫలితం రాలేదు. కానీ మోడీ కరుణించాడు. వారికి దేశ పౌరసత్వాన్ని ఇప్పించాడు.

నజీమ్ అక్తర్ భారతీయుడు.. పాకిస్తానీ అమ్మాయిని 1989లో వివాహం చేసుకున్నాడు. నిదా, మహరుఖ్ నసీం అనే ఇద్దరు అమ్మాయిలను కన్నాడు. వీరిని 1995లో ఇండియాకు తీసుకొచ్చాడు. అక్తర్ భార్యకు 2007లో భారత పౌరసత్వం వచ్చింది. అయితే నిదా - మహరుఖ్ కు ఇండియా పౌరసత్వం ఇవ్వాలని అక్తర్ తోపాటు ఈ అక్కాచెల్లెల్లు తిరగని ప్రాంతం లేదు.. కలవని అధికారి లేరు. 24 ఏళ్లుగా వారు ఇండియన్ పౌరసత్వం కోసం ఎదురుచూస్తున్నారు. కానీ అధికారులు పాకిస్తాన్ తో యుద్ధమేఘాలు, ఉద్రిక్తతల నేపథ్యంలో పౌరసత్వం ఇవ్వడం కుదరదని చెప్పారు. మీ దేశానికి వెళ్లిపోవాలని సూచించారట.. దీంతో నిరాశలో కూరుకుపోయారు.

ఎట్టకేలకు వారణాసిలో 2014లో గెలిచిన ప్రధాని అక్కడ మినీ పీఎంవోను ఏర్పాటు చేశారు. అక్కడికి వెళ్లి దరఖాస్తు చేసుకున్న ఈ అక్కచెల్లెల్లకు మోడీ కరుణించి భారత పౌరసత్వం ఇచ్చాడు. ఇలా 24 ఏళ్ల తర్వాత మార్చి 19న కన్ఫం చేసి తాజాగా పౌరసత్వంను చేతిలో పెట్టారు. దీంతో తమ కల నెరవేరిందని ఈ అక్కాచెల్లెళ్లు ఆనందంగా చెబుతున్నారు. జాతీయత విషయంలో తాము ఇన్నేళ్లకు గెలిచామని ఉద్వేగంగా చెప్పుకొచ్చారు.