Begin typing your search above and press return to search.
ప్రియుడిని కొట్టి వివాహితపై ఇద్దరు అత్యాచారం.. సోషల్ మీడియాలో వీడియోలు వైరల్!
By: Tupaki Desk | 4 Nov 2022 11:30 PM GMTభర్తను వదిలేసి తన ప్రియుడితో సరస సల్లాపాల్లో మునిగితేలిన వివాహితను ఇద్దరు వ్యక్తులు అత్యాచారం చేశారు. అడ్డు వచ్చిన ఆమె ప్రియుడిని చితకబాదారు. అంతేకాకుండా ఆమెపై అత్యాచారం చేస్తుండగా వీడియోలు తీసుకున్నారు. ఈ వీడియోలను అడ్డుగా పెట్టుకుని గత కొంతకాలంగా ఆమెను బెదిరిస్తూ పదే పదే అత్యాచారం చేస్తూ వస్తున్నారు. అంతటితో ఆగని ఆ కిరాతకులు ఆమెను బెదిరించి భారీగా డబ్బులు సైతం గుంజారు. అత్యాచారం చేస్తూ తీసిన వీడియోలను సైతం సోషల్ మీడియాలో వైరల్ చేశారు. దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. ఈ ఘటన తమిళనాడులో కలకలం రేపింది.
ఈ ఘటన పూర్తి వివరాల్లోకెళ్తే.. తమిళనాడులోని విల్లుపురం జిల్లా మరకానంలో ఒక 42 ఏళ్ల వివాహిత ఉంది. ఆమె భర్తతో విడిపోయింది. ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. భర్తతో విడిపోయాక ఆమె ఒక వ్యక్తితో సంబంధం పెట్టుకుంది. ముగ్గురు కుమార్తెలను పోషించడానికి విల్లుపురంలోనే ఒక లాడ్జ్‌లో ఉద్యోగం చేస్తోంది.
కాగా ఉద్యోగ విధులు పూర్తి కాగానే సమీపంలోని నిర్మానుష్య ప్రాంతానికి వెళ్లి తన ప్రియుడితో గడిపి వచ్చేది. ఈ క్రమంలో గత కొంతకాలంగా ఈ జంటను గమనిస్తున్న తైలమరాకు చెందిన భరతన్, అతడి స్నేహితుడు జంట గడుపుతున్న ప్రాంతానికి వెళ్లారు. వారిద్దరి రొమాన్స్‌ను వీడియో తీశారు.
ఆ తర్వాత మరోమారు ఆ జంట కలుసుకున్నప్పుడు వారి వద్దకు వెళ్లి ప్రియుడిని కొట్టి తరిమేశారు. ఆ వీడియోలు చూపిస్తూ ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. వాటిని సైతం వీడియోలు తీశారు. ఎక్కడైనా చెబితే ఆమె ప్రియుడిని, ఆమెను చంపుతామని బెదిరించారు.
ఇక అప్పటి నుంచి ఆ వీడియోలు చూపిస్తూ ఆమెను అత్యాచారం చేస్తున్నారు. అంతేకాకుండా ఆమె నుంచి భారీగా డబ్బులు దండుకుంటూ వస్తున్నారు. భరతన్, అతడి స్నేహితుడి వేధింపులు తట్టుకోలేని మహిళ ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంది. తాను మరణిస్తే ముగ్గురు కుమార్తెలు అనాథలవుతారని భయపడింది. చివరకు ధైర్యం చేసి కిరాతకులకు ఎదురుతిరిగింది. తన దగ్గర ఇక డబ్బులు లేవని.. తనను వదిలేయాలని ప్రాధేయపడింది. కామాంధులు ఆ వీడియోలను సోషల్ మీడియాలో, వాట్సాప్ గ్రూప్‌లో వైరల్ చేశారు.
దీంతో వివాహిత మహిళ కొత్తకుప్పం పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నారు. నిందితులు పరారీలో ఉన్నారని.. వారి కోసం గాలిస్తున్నామని తెలిపారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.