Begin typing your search above and press return to search.

అత్తతో అల్లుడి అక్రమ సంబంధం.. బయటకు పొక్కి ఇలా..

By:  Tupaki Desk   |   25 Dec 2020 1:30 AM GMT
అత్తతో అల్లుడి అక్రమ సంబంధం.. బయటకు పొక్కి ఇలా..
X
అక్రమ సంబంధాలు చివరకు ఎలాంటి విషాదాంతాలుగా మిగిలిపోయాయో మనం చూస్తునే ఉన్నాం.. తాజాగా వివాహేతర సంబంధం వల్ల రెండు నిండు ప్రాణాలు బలయ్యాయి. ఇలాంటి బంధాలు ఎంత ఎంతటి దు:ఖానికి దారితీస్తాయో మరోసారి చాటి చెప్పే ఘటన వరంగల్ రూరల్ జిల్లాలో జరిగింది.

అక్రమంగా సంబంధం ఏర్పరుచుకోవడంతో పరువుపోయినట్లు భావించిన ఓ జంట ఏకంగా ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటన వరంగల్ రూరల్ జిల్లా దేవనూరు గ్రామంలో చోటుచేసుకుంది.

వరంగల్ అర్బన్ జిల్లా పెద్దజాలు గుంట వద్ద ఓ అత్తా, అల్లుడు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. వీరి ఆత్మహత్యకు వివాహేతర సంబంధమే కారణమని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

వారిద్దరికీ వరుస కుదరకపోవడంతో పెళ్లి చేసుకోలేక వివాహేతర సంబంధం పెట్టుకున్నారని.. ఈ విషయం అందరికీ తెలిసిపోవడంతో అవమానం భరించలేక బలవన్మరణానికి పాల్పడినట్టుగా తెలుస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.