Begin typing your search above and press return to search.

హైద‌రాబాద్‌ లో తేడా కొట్టేస్తోంది..హైకోర్టు సంచ‌ల‌న ఆదేశాలు

By:  Tupaki Desk   |   4 March 2020 6:01 PM GMT
హైద‌రాబాద్‌ లో తేడా కొట్టేస్తోంది..హైకోర్టు సంచ‌ల‌న ఆదేశాలు
X
హైద‌రాబాద్ ఐటీ కారిడార్‌ లోని ఓ ఉద్యోగికి కరోనా సోకినట్లు జ‌రిగిన ప్ర‌చారం భాగ్య‌న‌గ‌ర వాసుల‌ను భ‌య‌కంపితుల‌ను చేసింది. వైరస్‌ వ్యాప్తిని అరికట్టేందుకు ముందు జాగ్రత్త చర్యగా ఉద్యోగులను ఇంటికి పంపించిన యాజమాన్యాలు వర్క్‌ ఫ్రమ్ హోంకు ఆదేశించాయి. హైదరాబాద్‌ లో కరోనా అనుమానితుల సంఖ్య పెరుగుతుండటంతో.. అత్యవసరమైతే తప్ప ఉద్యోగులు ప్రయాణాలు చేయకూడదని సూచించాయి. ఇదే స‌మ‌యంలో రాష్ట్ర హైకోర్టు కీల‌క ఆదేశాలు జారీచేసింది. దేశంలోనే తొలిసారి కరోనాపై ఆదేశాలిచ్చిన న్యాయ‌స్థానంగా నిలిచింది.

కరోనా వైరస్‌ ను నియంత్రించేందుకు సామూహిక సమావేశాలు తక్కువగా చేయాలని ప్రపంచ దేశాలు సూచిస్తున్నాయి. దీంతో ఈ ఏడాది హోలీ వేడుకల్లో పాల్గొనడం లేదని ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్‌ చేశారు. మ‌రోవైపు స‌రిగ్గా హోలీ పండుగ అంశంలోనే హైకోర్టులో ఓ పిటిష‌న్ దాఖ‌లైంది. కొండాపూర్‌ కు చెందిన ఓ మహిళ హోలీ పండుగపై ఆంక్షలు విధించాలని కోరుతూ ప్రజాప్రయోజన వ్యాజ్యం(పిల్) దాఖలు చేశారు. దీనిపై హైకోర్టు కీల‌క ఆదేశాలు ఇచ్చింది. ఇటు ప్ర‌భుత్వాల‌కు, అటు న్యాయ‌మూర్తుల‌కు సామాన్యుల‌కు త‌గు జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని స్ప‌ష్టం చేసింది.

కరోనా వ్యాప్తి నేపథ్యంలో అన్ని చర్యల్ని వెంటనే తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. న‌గ‌రంలో మాస్కుల కొరత ఏర్పడిందనే వార్తలపై ప్ర‌భుత్వ స్పంద‌న కోరింది. హోల్ సేల్ మార్కెట్ లో కావాల్సినన్ని మాస్కులు అందుబాటులో ఉన్నాయని ప్ర‌భుత్వ న్యాయ‌వాది తెలిపిన స్పంద‌న‌ను గౌర‌వించింది. ఈ సంద‌ర్భంగా కక్షిదారుల్ని కోర్టుకు రావొద్దన్న ధ‌ర్మాస‌నం లాయర్లందరూ తప్పనిసరిగా మాస్కులు ధరించాలని సూచించింది. ‘రేపటి నుంచి కోర్టులో గుంపులు గుంపులుగా జనం కనపడటానికి వీల్లేదు. కక్షిదారులెవరూ కోర్టుకు రానవసరంలేదు. ఈ విషయాన్ని లాయర్లే తమ క్లయింట్లకు తెలియపర్చాలి''అని జడ్జిలు ఆదేశించారు.