Begin typing your search above and press return to search.

ఢిల్లీ అల్లర్లపై కేంద్రం సంచలన నిర్ణయం

By:  Tupaki Desk   |   28 Feb 2020 6:01 AM GMT
ఢిల్లీ అల్లర్లపై కేంద్రం సంచలన నిర్ణయం
X
పౌరసత్వ సవరణ చట్టానికి అనుకూలంగా.. వ్యతిరేకంగా జరిగిన అల్లర్లలో 38మందికి పైగా మరణించడం దేశ రాజధాని ఢిల్లీలో తీవ్ర విషాదం నింపింది. ఆస్తుల విధ్వంసం భారీగా ఉంది. మరణాలు ఇంకా పెరిగే అవకాశం కనిపిస్తోంది.

ఈ నేపథ్యంలో ప్రస్తుతం కర్ఫూ విధించిన కేంద్రం.. ఈ అల్లర్ల పై సమగ్ర విచారణ జరిపి.. దోషులపై కఠిన చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధం చేసింది.

ఢిల్లీ అల్లర్లను అదుపు చేసేందుకు ఇప్పటికే జాతీయ భద్రతా సలహాదారులు అజిత్ దోవల్ పర్యటించి పరిస్థితిని కంట్రోల్ చేశారు. విద్యార్థులకు పరీక్షలను వాయిదా వేశారు. ఢిల్లీలో శాంతి భద్రతలపై కేజ్రీవాల్, మోడీలు సమీక్షించారు. కేజ్రీవాల్ చనిపోయిన వారి కుటుంబాలకు రూ.10లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించారు.

కాగా తాజాగా ఢిల్లీ అల్లర్లపై క్రైమ్ బ్రాంచ్ ఆధ్వర్యంలో ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) ఏర్పాటు చేశారు. నమోదైన కేసులు.. అరెస్ట్ అయిన వారిని, విచారణను సిట్ కు బదిలీ చేశారు. ఇద్దరు డీసీపీలు సిట్ కు నాయకత్వం వహించారు. క్రైమ్ బ్రాంచ్ అదనపు కమిషనర్ బీకే సింగ్ సిట్ బృందాలను పర్యవేక్షిస్తారు.