Begin typing your search above and press return to search.

ప్రియుడితో తల్లి జంప్.. కుమారుల ఆత్మహత్య

By:  Tupaki Desk   |   14 Jun 2020 10:10 AM GMT
ప్రియుడితో తల్లి జంప్.. కుమారుల ఆత్మహత్య
X
సమాజంలో బంధాలు, అనుబంధాలకు విలువ లేకుండా పోతోంది. తల్లి తన సుఖం కోసం ప్రియుడితో వెళ్లిపోగా ఏ దిక్కులేక అనాథలైన ఆ ఇద్దరు కుమారులు ఆత్మహత్య చేసుకోవడం విషాదం నింపింది.

తమిళనాడులోని పుదుక్కోట నామన సముద్రానికి చెందిన వెంకటాచలం(47) కూలీ పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. అతడికి భార్య జయదీప (40) - విఘ్నేశ్వరన్ (20) - యోగేశ్వరన్ (18) అనే ఇద్దరు కుమారులు ఉన్నారు.

పెద్ద కుమారుడు విఘ్నేశ్వరన్ పుదుక్కోటై ప్రభుత్వ కాలేజీలో బీకాం ఫైనల్ ఇయర్ చదువుతుండగా.. యోగేశ్వరన్ ఇంటర్ సెకండియర్ అభ్యసిస్తున్నాడు. ఇక తండ్రి వెంకటాచలంకు ఆరోగ్యం సరిగా లేకపోవడంతో కుటుంబం నుంచి విడిపోయి ఒంటరిగా జీవిస్తున్నాడు.

ఇద్దరు కుమారులతో జయదీప వేరుగా జీవిస్తోంది. ఈ క్రమంలోనే ఆమెకు ఒక వ్యక్తితో పరిచయం ఏర్పడింది. అది వివాహేతర సంబంధానికి దారితీసింది. రెండు రోజుల క్రితం ప్రేమించిన వ్యక్తితో తల్లి వెళ్లిపోయింది. పిల్లలను వదిలేసి పోవడంతో వారిద్దరూ కలత చెందారు. ఇద్దరు ఫ్యాన్ కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. కసాయి తల్లి చేసిన పనికి పాపం ఇద్దరు పిల్లలు తనువు చాలించిన ఘోరం తమిళనాట చోటుచేసుకుంది.