Begin typing your search above and press return to search.
అమ్మాయి కోసం ఇద్దరు విద్యార్థుల ఆత్మ‘హత్య’.?
By: Tupaki Desk | 1 Oct 2018 9:28 AM GMTనిండా పదహారేళ్లు లేవు.. పదోతరగతి చదువుకున్నారు.. సినిమాల ప్రభావమో.. లేక ఆధునిక పోకడల ఎఫెక్టో తెలియదు కానీ.. ఆ విద్యార్థులు కట్టుతప్పారు. అమ్మాయి కోసం కొట్లాడుకున్నారు. చివరకు ఆ పోరులోనే ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాధ సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలన సృష్టించింది.
జగిత్యాల జిల్లా కేంద్రంలో ఓకే అమ్మాయిని ప్రేమించిన ఇద్దరు స్నేహితులు పరస్పరం ఘర్ణణ పడి క్షణికావేశంలో ఒకరిపై ఒకరు పెట్రోల్ పోసుకొని నిప్పటించుకున్నారు. తీవ్రంగా గాయపడి ప్రాణాలు కోల్పోయారు. జగిత్యాల పట్టణంలోని విజయపురికాలనీకి చెందిన కూసరి మహేందర్ (16), విద్యానగర్ కు చెందిన బంటు రవితేజ(16) స్నేహితులు. స్థానిక మిషనరీ పాఠశాలలో పదోతరగతి చదువుతున్నారు. ఆదివారం పొద్దు పోయాక ఇద్దరూ పట్టణంలోని మిషన్ కాంపౌండ్ వద్దకు వెళ్లారు. అనంతరం పరస్పరం అమ్మాయి విషయంలో ఘర్షణ పడ్డారు. క్షణికావేశంలో వెంట తెచ్చుకున్న పెట్రోల్ ఒకరిపై ఒకరు చల్లుకొని నిప్పంటించుకున్నారు. పోలీసులకు సమాచారం అందడంతో వారు 108లో జగిత్యాల ఆస్పత్రికి తరలించారు. ఈలోపే మహేందర్ మృతిచెందగా.. రవితేజ కరీంనగర్ కు తరలిస్తుండగా ప్రాణాలు కోల్పోయాడు.
ఘటన స్థలంలో బీరుసీసాలు ఉండడాన్ని బట్టి ఫుల్లుగా మద్యం తాగి ఘర్షణ పడి ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారని పోలీసులు తేల్చారు. ఒక అమ్మాయి కోసం గొడవపడి బలవన్మరణానికి పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే వీరిద్దరిని ఎవరైనా పెట్రోల్ పోసి కాల్చి చంపారా అన్న కోణంలోనూ విచారిస్తున్నారు. ఇప్పుడిప్పుడు పైకి ఎదుగుతున్న కొడుకులు ఇలా ప్రేమ వ్యవహారంలో తనువు చాలించడం చూసి ఆ తల్లిదండ్రుల రోదనలు స్థానికులను కంటతడిపెట్టించాయి.