Begin typing your search above and press return to search.
రేవంత్ కేసులో మరో ఇద్దరు ఎంపీలు బుక్?
By: Tupaki Desk | 10 Jun 2015 4:41 AM GMTఓటుకు నోటు వ్యవహారం రోజురోజుకి ఆసక్తికర మలుపులు తిరుగుతున్నట్లుగా కనిపిస్తోంది. మొదట్లో అనుకున్నట్లు రేవంత్ లక్ష్యంగా అనుకున్నప్పటికీ.. రోజులు గడిచేకొద్దీ జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే.. టీఆర్‌ఎస్ నేతలు తరచూ.. తెలంగాణలో తెలుగుదేశం ఖాళీ చేస్తామన్న వ్యాఖ్యలకు తగ్గట్లే పరిణామాలు చోటు చేసుకుంటున్నాయన్న వాదన వ్యక్తమవుతోంది.
రేవంత్ కేసు వ్యవహారంలో చంద్రబాబువిగా చెబుతున్న ఆడియో టేపు బయటకు రావటం తెలిసిందే. తాజాగా.. స్టీఫెన్‌సన్‌కు కుదుర్చుకున్న రూ.5కోట్ల ఒప్పందంలో తెలుగుదేశం పార్టీకి చెందిన ఇద్దరు ఎంపీలు పాలుపంచుకున్నట్లుగా చెబుతున్నారు.
చంద్రబాబుకు సన్నిహితులైన సీఎం రమేష్‌తో పాటు.. గరికపాటి మోహన్‌రావుల ప్రమేయం ఉందన్న ఆధారాలు ఏసీబీ చేజిక్కించుకున్నట్లుగా చెబుతున్నారు.ఓటుకు నోటు కేసులో వీరి పాత్ర ఉన్నట్లుగా ఏసీబీ ఆధారాలు సంపాదించినట్లుగా చెబుతున్నారు. మరోవైపు చంద్రబాబు పాత్రకు సంబంధించిన ప్రాధమిక ఆధారాలు ఉన్నట్లుగా కొన్ని మీడియా సంస్థల్లో వార్తలు వస్తున్నాయి. మొత్తానికి రేవంత్ వ్యవహారంలో మరిన్ని పెద్ద తలకాయల పేర్లు బయటకు రావచ్చన్న అభిప్రాయం బలంగా వినిపిస్తోంది.