Begin typing your search above and press return to search.
సీఎం కాన్వాయ్ కే ఎదురెళ్లారు.. ఏం జరిగిందంటే?
By: Tupaki Desk | 8 Aug 2021 11:38 AM GMTఅది ముఖ్యమంత్రి కాన్వాయ్.. ఈ కాన్వాయ్ వస్తుందంటే రోడ్డు క్లియర్ గా ఉండాలి.. అక్కడున్న వాహనాలను తొలగించాలి.. ఇతర వాహనాలు అటువైపు రాకుండా చేయాలి.. సీఎం బయలుదేరిన నుంచి గమ్యం చేరే వరకు పకడ్బందీగా దారి చూపాలి. ఇది సివిల్, ట్రాఫిక్ పోలీసులు కలిసి పకడ్బందీగా అమలు చేస్తారు. దాదాపు రోడ్డు వెంబడి పోలీసులే సీఎం కాన్వాయ్ కి రక్షణగా ఉంటారు. ఇతర వాహనమొక్కటైనా అడ్డం రాకుండా చర్యలు తీసుకుంటారు. కానీ షాకింగ్.. సీఎం కాన్వాయ్ కు ఓ ఇద్దరు కుర్రాళ్లు ఎదురెళ్లారు. వీరిని చూసి పోలీసులు చాలా ఆందోళన చెందారు. రాంగ్ రూట్లో పోవడమే కాకుండా ముఖ్యమంత్రి ప్రయాణానికి భంగం కలిగించే విధంగా ప్రవర్తించిన ఆ కుర్రళ్ల గుచించి తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
తెలంగాణలో పాత సచివాలయాన్ని తీసేసి కొత్త సచివాలయాన్ని కడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ ఆ పనులను చూసేందుకు నిన్న వెళ్లారు. ఆ తరువాత తిరిగి ప్రగతి భవన్ కు బయలుదేరారు. ఈ క్రమంలో కాన్వాయ్ ఎన్టీఆర్ మార్గ్ లోకి రాగానే ఇద్దరు కుర్రాళ్లు ఒక్కసారి కాన్వాయ్ కి ఎదురుగా వెళ్లారు. అంతేకాకుండా రాంగురూట్లో రయ్ మంటూ స్పీడు పెంచారు. అయితే వీరిని పట్టుకొని చర్యలు తీసుకోవచ్చు. ఆ తరువాత జరిమానా వేయవచ్చు. కానీ ఆ కాసేపు పోలీసుగ గుండెల్లో రైళ్లు పరుగెత్తాయి. ఏం జరుగుతోందనని ఆందోళన చెందారు.
మొత్తానికి ఆ కుర్రళ్ల బైక్ ను పోలీసులు పట్టుకున్నారు. ఆ తరువాత పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు. అయితే వారికి అసలు విషయం తెలిసి ఆశ్చర్యపోయారు. శాస్త్రిపురం, నిలోఫర్ ప్రాంతానికి చెందిన 11, 14 ఏళ్ల టీనేజర్లు ఓ బైక్ ను కొన్నారు. దానిని కేవలం 2 వేలకుమాత్రమే కొనుగోలు చేశారు. అయితే వారు నడిపిన బైక్ చోరీకి గురైనట్లు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు నమోదైంది. ఆ చిన్నారులకు బైక్ అమ్మిన వారి కోసం పోలీసులు ఆరా తీస్తున్నారు.
ఇక సీఎం కాన్వాయ్ కి ఎదురుగా వెళ్లిన ఆ చిన్నారుల తల్లిదండ్రులను పోలీస్ స్టేషన్ కు పిలిచారు. టీనేజర్లతో పాటు తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇచ్చారు. చిన్న వయసులోనే ఇలా బైక్ పై పంపిస్తే ఎలా అని అడిగారు. మొత్తానికి వారిని వదిలిపెట్టారు. కానీబైక్ దొగతనంపై ఆరా తీస్తున్నారు. కుర్రాళ్లు ఈ బైక్ ను కొనుగోలు చేసి మొదట చార్మినార్ వైపు వెళ్లారు. ఆ తరువాత ఎన్టీఆర్ మార్గ్ వైపు వచ్చారు. ఇక్కడ పోలీసులకు చిక్కకపోతే ఇంకా చాలా చోట్ల తిరిగేవారు.
ఇక సీఎం కాన్వాయ్ వెళ్లిన మార్గంలో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయి. దాదాపు ఆ దారిలో ఎవరినీ రానివ్వరు.. పోనివ్వరు.. అయితే వైఎస్ రాజశేఖర్ రెడ్డి తన కోసం ప్రజలను ఆపొద్దని చెప్పేవారు. అయినా ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకునేవారు. అయితే తెలంగాణ వచ్చాక నిబంధనలు చాలా మారాయి. రాంగ్ రూట్లో వెళ్లినా, ప్రజాప్రతినిధుల విధులకు ఆటంకం కలిగించినా చర్యలు తీసుకుంటున్నారు. వాస్తవానికి ఇలా ఇతర పార్టీల నాయకులు వెళ్లి ఆందోళన చేస్తారు. కానీ వారిపై తర్వాత కఠిన చర్యలుంటాయి.
ఇక్కడ మైనర్లు అయినందువల్ల కౌన్సెలింగ్ ఇచ్చి వదిలేశారు. మరోసారి ఇలాంటి తప్పు చేయకూడదని చెప్పారు. అయితే వారు తెలియకనే ఈ మిస్టేక్ చేసినట్లు అర్థమవుతోంది. సీఎం కాన్వాయ్ కి ఎదురుగా ఇద్దరు యువకులు వెళ్లారని ముందుగా సోషల్ మీడియాలో ప్రచారం సాగింది. గాయాలయ్యాయని కూడా వార్తలు వచ్చాయి. కానీ వీరికి ఎలాంటి గాయాలు కాలేదు.