Begin typing your search above and press return to search.
అమెరికాలో ఐడా హరికేన్ ఉధృతి...ఇద్దరు తెలుగువారు మృతి
By: Tupaki Desk | 6 Sep 2021 6:56 AM GMTఅమెరికాలో ఐడా హరికేన్ ఉధృతి న్యూయార్క్, న్యూజెర్సీల్లో ఎమర్జెన్సీ ప్రకటించారు. రికార్డ్ స్థాయిలో కురిసిన వర్షం కారణంగా భయంకరమైన వరదలు రావడంతో, ఎమర్జెన్సీ ప్రటిస్తున్నట్టు న్యూయార్క్ సిటీ మేయర్ బిల్ డె బ్లాసియో, న్యూజెర్సీ గవర్నర్ ఫిల్ ముర్ఫే ట్వీట్ చేశారు. వరద ప్రమాదకర స్థాయిలో ఉందని, ఎవరూ ఇల్లు దాటి బయటకు రావొద్దని ప్రజలకు సూచించారు. రోడ్లు, సబ్ వేల వద్ద పరిస్థితి బీభత్సంగా ఉందని, వెహకల్స్ డ్రైవ్ చేసుకుని రోడ్లపైకి వచ్చే సాహసం చేయొద్దని చెప్పారు. ఐదా హరికేన్ తో న్యూయార్క్ స్టేట్ మొత్తం అతలాకుతలమవుతోంది. న్యూయార్క్ సిటీ వీధులు నీటితో నిండిపోయాయి. ఒక గంటసేపట్లోనే సిటీలో 8 సెంటీమీటర్ల వర్షం కురిసింది. సిటీలోని సబ్ వేలన్నింటిని క్లోజ్ చేశారు.
అమెరికాలో ఐడా హరికేన్ ఉధృతి కారణంగా పోటెత్తిన వరదల్లో చిక్కుకొని ఇద్దరు తెలుగు వారు మృత్యువాత పడ్డారు. న్యూయార్క్ లో సాఫ్ట్‌వేర్ డిజైనర్‌గా పనిచేస్తున్న మాలతి కంచె మృతి చెందారు. ఈ నెల ఒకటో తేదీ సాయంత్రం రేరిటాన్‌కు చెందిన మాలతి కంచె(46) తన కుమారుడిని రట్జెర్స్ యూనివర్సిటీ కాలేజీలో దించి, కుమార్తె తో కలిసి కారులో ఇంటికి బయలుదేరారు. బ్రిడ్జివాటర్ ప్రాంతంలో రూట్ –22 రోడ్డుపైకి అకస్మాత్తుగా చేరుకున్న నడుముల్లోతు వరద నీటిలో వారు చిక్కుకు పోయారు. కారులో నుంచి బయటపడిన తల్లి, కూతురు ఒక చెట్టును పట్టుకున్నారు. ఆ చెట్టు కూడా కూలిపోగా మాలతి వరద ఉధృతికి కొట్టుకు పోయారు.
ఈదడం తెలిసిన ఆమె కూతురు సురక్షితంగా బయటపడింది. మాలతి గల్లంతైనట్లు సమాచారం అందుకున్న అధికారులు అన్వేషణ ప్రారంభిం చారు. ఆమె మృత దేహాన్ని అక్కడికి 8 కిలోమీటర్ల దూరంలోని బౌండ్‌బ్రూక్ వద్ద శుక్రవారం కనుగొన్నారు. మాలతి స్వస్థలం హైదరాబాద్ కాగా, ఆమె భర్త ప్రసాద్ కంచె తెనాలికి చెందినవారు. వీరిది ప్రేమ వివాహం. గతవారం న్యూజెర్సీలోని సౌత్ ప్లెయిన్ ఫీల్డ్ లో ధనుష్ రెడ్డి అనే మరో ప్రవాసీయుడు మురుగునీటి పైపులో పడి చనిపోయారు. న్యూయార్క్ లో మరో ఇద్దరు భారత సంతతి వారు కూడా వరదల్లో చిక్కుకొని మృతిచెందారు . ధనుష్ రెడ్డి అనే వ్యక్తి నడిచి వెళ్తుండగా అకస్మాత్తుగా వచ్చిన వరద తీవ్రతకు కొట్టుకు పోయారు. ధనుష్ రెడ్డి మృతదేహాన్ని మరుసటి రోజు అక్కడికి 8 కిలోమీటర్ల దూరంలోని పిస్కాట్‌ఎవే అనే ప్రాంతంలో కనుగొన్నారు.