Begin typing your search above and press return to search.

తెలుగు రాష్ట్రాల్లో అవినీతి పారుతోంది బ్రో!

By:  Tupaki Desk   |   24 Dec 2022 4:30 AM GMT
తెలుగు రాష్ట్రాల్లో అవినీతి పారుతోంది బ్రో!
X
రెండు తెలుగు రాష్ట్రాల్లో నీతి మంత‌మైన ప‌నులు ఎలా ఉన్న‌ప్ప‌టికీ..అవినీతి మంత‌మైన ప‌నులు మాత్రం జోరుగా సాగుతున్నాయ‌ని.. తాజాగా ఓ స‌ర్వే బ‌ట్ట‌బ‌య‌లు చేసింది. ఏపీ, తెలంగాణ రెండు రాష్ట్రాల్లో ఏదీ కూడా.. అవినీతికి వ్య‌తిరేకం కాద‌ని.. ఎక్క‌డిక‌క్క‌డ ప్ర‌జ‌ల నుంచి దోపిడీ య‌థేచ్ఛ‌గా సాగుతోంద‌ని ఈ సంస్థ చెప్పింది. రెండు రాష్ట్రాల ప్ర‌జ‌ల‌ను 'యూత్ ఫ‌ర్ యాంటీ క‌ర‌ప్ష‌న్‌' సంస్థ ప‌ల‌క‌రించింది.

ఈ నేప‌థ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల ప్ర‌జ‌లు.. 'అవినీతి బాగా పెరిగిపోయింది' అని ముక్త‌కంఠంతో చెప్పుకొచ్చారు. మొత్తంగా 94 శాతం మంది ఇదే అభిప్రాయం వ్య‌క్తం చేయ‌డం గ‌మ‌నార్హం.

రెండు ప్ర‌భుత్వాల్లోని వివిధ శాఖల్లో అధికారుల పనితీరు ఎలా ఉందని అడిగితే బాగా లేదంటూ 81 శాతం మంది చెప్పారు.

ఏ పని కోసం వెళ్లినా బ్రోకర్ల ద్వారానే నడుస్తున్నదని స్పష్టం చేశారు. బ్రోకర్ల వ్యవస్థే అవినీతి పెరగడానికి ప్రధాన కారణమని 50 శాతం మంది తెలిపారు.

మ‌రి ఇప్ప‌టికైనా.. రెండు తెలుగు రాష్ట్రాల పాల‌కులు క‌ళ్లు తెరుస్తారా? అనేది ప్ర‌శ్న‌. లేక‌పోతే..ప్ర‌జ‌లే క‌ళ్లు తెరుచుకుని ఓటు వేసే ప‌రిస్థితి వ‌స్తుంద‌ని ప‌రిశీల‌కులు అంటున్నారు.

ఇటీవ‌ల తెలంగాణ‌లోని జ‌గిత్యాల్లో పోస్టు మార్టం కోసం రూ.5 వేలు డిమాండ్ చేసిన ఘ‌ట‌న వైర‌ల్ అయింది. దీనిని అరిక‌ట్టే నాథుడు లేక‌పోగా.. అంద‌రికీ వాటాలున్నాయంటూ.. ఆ వైద్యుడు చెప్పిన మాట‌పైనా.. చ‌ర్య‌లే లేవు. ఏపీలోనూ ఇంత‌క‌న్నా తీసిపోలేదు. విచ్చ‌ల‌విడి.. అక్ర‌మ అరాచ‌కాల‌కు.. విజ‌య‌వాడ‌, విశాఖ‌, నెల్లూరు గుంటూరు రిజిస్ట్రార్ ఆఫీసులు కేరాఫ్‌గా మారాయి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.