Begin typing your search above and press return to search.
కోల్ కతాలో మరో కరోనా బాధితుడు..మొత్తం ఎంతమందంటే ?
By: Tupaki Desk | 13 Feb 2020 12:40 PM GMTచైనాని వణికిస్తోన్న కరోనా వైరస్ ..రోజురోజుకి మరింతగా విజృంభిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా ఈ కరోనా వైరస్ ప్రభావం తో ఇప్పటివరకు మొత్తంగా 1350 మందికి పైగా చనిపోయారు. ముఖ్యంగా ఈ వైరస్ ప్రభావంతో చైనా లో జనాభా పిట్టల్లా రాలిపోతున్నారు. అలాగే ఈ కరోనా వైరస్ ఇప్పటికి 26 దేశాలలో విస్తరించింది. కరోనా వైరస్ కి కోవిడ్-19 ని who నామకరణం చేసిన విషయం తెలిసిందే. ఇకపోతే ఈ కరోనా వైరస్ భారిన పడుతోన్న బాధితుల సంఖ‍్య భారత దేశంలో కూడా క్రమంగా పెరుగుతోంది.
గురువారం కోల్ కతాలోని నేతాజీ సుభాష్ చంద్ర బోస్ అంతర్జాతీయ విమానాశ్రయంలో మరో వ్యక్తికి కరోనా వైరస్ సోకినట్టు నిర్ధారించారు. బ్యాంకాక్ నుంచి కోల్ కతా చేరుకున్న ప్రయాణికుడికి కరోనా వైరస్ పాజిటివ్ గా నిర్ధారించినట్లు విమానాశ్రయ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులు గురువారం తెలిపారు. దీంతో కోల్ కతాలో కరోనావైరస్ సోకిన వారి సంఖ్య మూడుకు చేరింది. మంగళ - బుధవారాల్లో కోలకతా విమానాశ్రయంలో హిమాద్రి బార్మాన్ - నాగేంద్ర సింగ్ ఇద్దరు ప్రయాణికులకు నిర్ధారిత పరీక్షలో పాజిటివ్ వచ్చిందని విమానాశ్రయం డైరెక్టర్ కౌశిక్ భట్టాచార్జీ పీటీఐకి తెలిపారు. వీరిద్దరినీ బెలియాఘాటా ఐడి ఆసుపత్రికి పంపినట్లు తెలిపారు. అంతకుముందు అనితా ఒరాన్ అనే ప్రయాణీకుడికి కూడా థర్మల్ స్కానింగ్ సమయంలో పాజిటివ్ వచ్చినట్టు భట్టాచార్జీ చెప్పారు.
ఈ నేపథ్యంలో కోల్ కతా - చైనా మధ్య విమానాల సేవలను తాత్కాలికంగా ఆపేసారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్గదర్శకాల మేరకు ఇండిగో ఫిబ్రవరి 6- 25 - 2020 వరకు కోల్ కతా- గ్వాంగ్ జౌ మధ్య తన విమానాలను తాత్కాలికంగా నిలిపివేసింది. ఇండిగో తరువాత, చైనా ఈస్టర్న్ ఎయిర్ లైన్స్ ఫిబ్రవరి 10 నుండి ఫిబ్రవరి 29 వరకు చైనాలోని కోల్ కతా - కున్మింగ్ మధ్య విమానాలను నిలిపివేసింది. ఈ నేపథ్యంలో చైనా - బ్యాంకాక్ తదితర దేశాల నుండి వచ్చే ప్రయాణికుల పై ఎయిర్ పోర్ట్ అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టారు. వారికీ అన్ని టెస్టులు పూర్తి చేసిన తరువాతే ఎయిర్ పోర్ట్ నుండి బయటకి వెళ్ళడానికి అనుమతి ఇస్తున్నారు.