Begin typing your search above and press return to search.
హై కమాండ్ బ్లెస్సింగ్స్ : గంటా ఫ్యామిలీకి రెండు టికెట్లు...?
By: Tupaki Desk | 13 Jun 2022 11:30 PM GMTవిశాఖ జిల్లాలో సీనియర్ మోస్ట్ లీడర్ గా ఉన్న మాజీ మంత్రి, టీడీపీ నేత గంటా శ్రీనివాసరావుకు అధినాయకత్వంలో గ్యాప్ పూర్తిగా పోయింది అంటున్నారు. చంద్రబాబే ఏపీకి మళ్లీ సీఎం కావాలని ఈ మధ్యనే గట్టిగా గంటా నినదించారు. అంతే కాదు ఆయన వస్తేనే ఏపీ బాగుపడుతుంది అని కూడా గట్టిగా చాటింపు వేశారు. అయితే గంటా మహానాడులో సౌండ్ చేయకపోవడంతో కధ మళ్ళీ మొదటికి వచ్చిందా అన్న డౌట్లు పార్టీలో కొందరికి వచ్చాయి. కానీ గంటా ప్రాధాన్యత ఏమాత్రం తగ్గలేదని, అధినాయకత్వం సైతం ఆయనను ముందుంచి కీలక బాధ్యతలు అప్పగించి విశాఖ జిల్లాలో సైకిల్ జోరు పెంచాలని చూస్తోందని అంటున్నారు.
ఈ నేపధ్యంలో గంటా శ్రీనివాసరావు కోరుకున్న విధంగా గాజువాక టికెట్ ని ఇవ్వడానికి అధినాయకత్వం అంగీకరించింది అని తాజాగా వచ్చిన పార్టీ వర్గాల సమాచారం మేరకు తెలుస్తోంది. గంటా వచ్చే ఎన్నికల్లో ఉత్తరం నుంచి వేరే చోటకు తన ప్లేస్ మార్చుకోవాలని చూస్తున్నారు. దీనికి తాజాగా అధినాయకత్వం గంటాతో చర్చించినట్లుగా తెలుస్తోంది. విశాఖ జిల్లా టీడీపీకి కంచుకోట. అక్కడ కీలకమైన మార్పులను కూడా హై కమాండ్ చేపడుతోంది.
ఇక అంగబలం, అర్ధబలం ఉన్న గంటాను పూర్తి స్థాయిలో ఉపయోగించుకోవాలని కూడా చూస్తోంది. మొత్తం మీద చూస్తే గంటా మీదనే విశాఖ జిల్లా టీడీపీ బాధ్యతలను మొత్తం పెట్టేశారు అని అంటున్నారు. దాంతో గంటా కూడా తనకు అనుకూలంగా పరిస్థితులను మార్చుకుంటున్నారు అని అంటున్నారు. గాజువాక నుంచి పోటీ చేయడానికి ఆయన రంగం సిద్ధం చేసుకుంటున్నారు. దానికి హై కమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. ఇక గంటా వదిలి వెళ్తున్న విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి గంటా మేనల్లుడు విజయ్ బాబుకి పోటీకి నిలపాలని కూడా హై కమాండ్ చూస్తోంది.
గంటా కోరిక మీదనే ఇదంతా జరుగుతోంది. వచ్చే ఎన్నికల్లో అలా తన కుటుంబానికి రెండు టికెట్లను చంద్రబాబు నుంచి గంటా సాధించుకున్నారు అని తెలుస్తోంది. గంటా భీమిలీలో ఉన్నా ఉత్తర నియోజకవర్గంలో ఉన్నా కూడా డీఫ్యాక్టో ఎమ్మెల్యేగా మొత్తం చక్రం తిప్పుతోంది మేనల్లుడు విజయ్ బాబు మాత్రమే. దాంతో పాటు యువతకు టికెట్లు ఇస్తామన్న పార్టీ మాట తప్పకుండా విజయ్ నే ముందు పెట్టి కధ నడుపుతారు అని అంటున్నారు.
ఇక గంటాతో మంచి సాన్నిహిత్యం ఉన్న గాజువాక మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావును కూడా ఇందుకు అంగీకరించారు అని అంటున్నారు. వచ్చే ఎన్నికల్లో ఆయనను విశాఖ నుంచి ఎంపీగా పల్లాను పోటీ చేయించాలని అటు చంద్రబాబు ఇటు గంటా భావిస్తున్నారు. ఆయన గెలిచేలా పూర్తి బాధ్యతలను గంటా తీసుకుంటారు అని తెలుస్తోంది. విశాఖ ఎంపీ స్థానం పరిధిలో యాదవులు కాపులే ఎక్కువ. ఈ రెండు సామాజికవరాలు కలిస్తే గెలుపు కు తిరుగు ఉండదు, దాంతో యాదవ సామాజికవర్గానికి చెందిన పల్లా శ్రీనివాసరావుని బరిలోకి దింపాలని డిసైడ్ అయ్యారని టాక్. మొత్తానికి గంటా మళ్లీ టీడీపీలో చక్రం తిప్పడానికి రంగం సిద్ధం అయింది.
ఇక తన ఇంట్లో రెండు టికెట్లు ఇప్పించుకున్న గంటా అనకాపల్లి జిల్లాతో పాటు విజయనగరం జిల్లాలో కూడా తన అనుచరులకు కచ్చితంగా టికెట్లు ఇప్పించుకోవడంతో విజయం సాధిస్తారు అని అంటున్నారు. మొత్తానికి గంటా కోటాలో అరడజన్ సీట్లు అయినా ఉత్తరాంధ్రా జిల్లలలో అధినాయకత్వం ఇస్తుందని టాక్ అయితే నడుస్తోంది. అదే విధంగా ఉత్తరాంధ్రాలో పార్టీకి అన్ని విధాలుగా వెన్నుదన్నుగా ఉండడానికి గంటా ఇప్పటి నుంచే ప్రిపేర్ అవుతున్నారని చెబుతున్నారు.