Begin typing your search above and press return to search.

షాకింగ్: రెండు వారాల పిండానికీ కరోనా సోకే అవకాశం.. వైద్య నిపుణుల అధ్యయనంలో వెల్లడి

By:  Tupaki Desk   |   6 Aug 2020 10:30 AM GMT
షాకింగ్: రెండు వారాల పిండానికీ కరోనా సోకే అవకాశం.. వైద్య నిపుణుల అధ్యయనంలో వెల్లడి
X
కరోనాతో ఇప్పటికే చిన్నా పెద్దా తేడా లేకుండా అందరూ దాని బారిన పడుతున్నారు. పిల్లలు, వృద్ధులు, బాలింతలు, గర్భిణులు కరోనాతో అవస్థలు పడుతున్నారు. తల్లి కరోనా బారిన పడితే బిడ్డకు ప్రమాదం ఉంటుందని మార్చిలోనే వైద్య నిపుణులు హెచ్చరించారు. ఆ తర్వాత నవజాత శిశువుకు కూడా కోవిడ్ ఉన్నట్టు నిర్ధారించారు. ఇప్పుడు వైద్య నిపుణులు మరో షాకింగ్ న్యూస్ చెప్పారు. రెండు వారాల పిండం కూడా కోవిడ్ బారిన పడే అవకాశం ఉందని వెల్లడించారు. గర్భిణి కరోనా బారిన పడితే పిండానికి కూడా లక్షణాలు సోకుతాయని చెబుతున్నారు. గర్భిణి అనారోగ్యానికి గురైతే పిండానికి కూడా తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని వెల్లడిస్తున్నారు.

క్రైమ్ బ్రిడ్జి విశ్వవిద్యాలయానికి చెందిన వైద్య నిపుణులు పిండానికి కరోనా సోకే అంశంపై పరిశోధన సాగించారు. వారు అధ్యయనం కోసం జన్యు వ్యక్తీకరణ డేటాను ఉపయోగించారు. పిండం తల్లి గర్భానికి అతుక్కుని దాని కణజాలాలన్నింటినీ పునర్ నిర్మించేటప్పుడు వైరస్ బారిన పడే అవకాశం ఉందని చెబుతున్నారు. ఒకవేళ వైరస్ బారిన పడితే పిండం ఎదుగుదలలో ప్రభావం చూపుతుందని హెచ్చరిస్తున్నారు. అయితే పిండం ఇన్ఫెక్షన్ బారిన పడితే తల్లికి హాని కలిగిస్తుందో లేదా అనే విషయమై వారి స్పష్టత ఇవ్వలేదు. కరోనా తీవ్రత అధికమైన నేపథ్యంలో గర్భిణులు ఇతరులకు దూరంగా ఉండటమే చాలా మంచిదని సూచిస్తున్నారు.