Begin typing your search above and press return to search.
ఈ రైతు మహా సుడిగాడు.. ఇద్దరు భార్యలు ఎన్నికల్లో గెలిచారు
By: Tupaki Desk | 5 Jan 2020 7:01 AM GMTఇలాంటి ఉదంతాలు ఎక్కడా విని ఉండమేమో. సిత్రమైన ఉదంతం తమిళనాడులో చోటు చేసుకుంది. ఒక వ్యక్తికి ఇద్దరు భార్యలు అక్కడక్కడా ఉంటారు. అలానే తమిళనాడుకు చెందిన ఆ రైతుకు ఇద్దరు భార్యలు. కానీ.. ఆ ఇద్దరు భార్యలు వేర్వేరు చోట్ల జరిగిన ఎన్నికల్లో పోటీ చేయటం ఒక ఎత్తు అయితే.. ఆ ఎన్నికల్లో విజయం సాధించిన వైనం మరో ఎత్తు.
విజేతలుగా నిలిచిన ఇద్దరు భార్యల్ని చెరో పక్క నిలబెట్టుకొని ఆ రైతు విజయగర్వంతో దిగిన ఫోటో ఇప్పుడు వైరల్ గా మారటమే కాదు.. అందరిని ఆకర్షిస్తోంది. ఆసక్తికరంగా మారిన ఈ ఉదంతంలోకి వెళితే.. తమిళనాడులోని తిరువణ్ణామలై జిల్లా వందవాసి పంచాయితీ పరిధిలోని వళిపూర్ అగరం గ్రామానికి చెందిన 49 ఏళ్ల రైతు ధనశేఖర్ కు ఇద్దరు భార్యలు. ఒకరి పేరు సెల్వీ కాగా.. మరొకరు కాంచన. పెద్ద భార్యకు 46 ఏళ్లు అయితే.. చిన్నభార్యకు 37 ఏళ్లు.
పెద్దభార్య సెల్వీ గతంలోనే వళివూర్ అగరం పంచాయితీకి అధ్యక్షురాలిగా పని చేశారు. తాజాగా అదే పదవికి మరోసారి పోటీ చేశారు. ఇక.. ధనశేఖర్ చిన్న భార్య కాంచన స్వగ్రామం కోవిల్ కుప్పం సాత్తనూరు. ఆమెకు అక్కడే ఓటు ఉంది. తాజాగా జరిగిన ఎన్నికల్లో పెద్ద భార్య వళివూర్ అగరం పంచాయితీ అధ్యక్షురాలిగా పోటీ చేస్తే.. చిన్న భార్య కోలిల్ కుప్పం సాత్తనూర్ పంచాయితీ అధ్యక్ష పదవికి పోటీ చేశారు. ఆశ్చర్యకరంగా రెండు చోట్ల ధనశేఖర్ ఇద్దరు భార్యలు గెలవటంతో సదరు రైతు ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. రెండు గ్రామాల పంచాయితీ అధ్యక్షురాలైన తన ఇద్దరు భార్యలతో కలిసి విజయగర్వంతో ఫోటోలు దిగుతున్నారు. ధనశేఖర్ లక్ కు అందరూ అసూయ పడుతున్న వారేనట.