Begin typing your search above and press return to search.

లాక్ డౌన్ : ఇద్దరు యువతుల ఆత్మహత్య .. కారణం ఏంటంటే !

By:  Tupaki Desk   |   13 April 2020 9:30 AM GMT
లాక్ డౌన్ : ఇద్దరు యువతుల ఆత్మహత్య .. కారణం ఏంటంటే !
X
కరోనా కట్టడిలో భాగంగా దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ అమలు చేస్తున్నారు. ఈ సమయంలో హైదరాబాద్‌ లోని జవహర్ నగర్‌ లో ఒకేచోట మూడు మృతదేహాలు లభ్యమవడం కలకలం రేపుతోంది. జవహర్‌నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని డెంటల్ కాలేజ్ డంపింగ్ యార్డ్ సమీపంలో చెట్టుకు ఉరివేసుకుని ఇద్దరు యువతులు బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ ఘటన గురించి తెలిసిన వెంటనే స్థానికులు పోలీసులకి సమాచారం ఇచ్చారు. అక్కడ మృతదేహాలను పరిశీలిస్తున్న సమయంలోనే చెట్టు పక్కన మరో చిన్నారి మృతదేహం ఉండటంతో పోలీసులు షాక్ అయ్యారు. ఆ ఇద్దరు యువతుల వయసు 20-22ఏళ్ల మధ్య ఉంటుందని తెలుస్తోంది.

లాక్ డౌన్ వేల ఇలా రెండు మృతదేహాలు చెట్టుకి వ్రేలాడుతూ కనిపించడంతో ..అందరూ షాక్ అయ్యారు. దీనితో వేరే ప్రదేశంలో హత్య చేసి ఇక్కడికి తీసుకొచ్చి చెట్టుకు వేలాడదీశారా.. లేక వేరే ప్రాంతానికి చెందిన యువతులు ఇక్కడికొచ్చి ఆత్మహత్య చేసుకున్నారా అన్న కోణంలో ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు జరిపారు. అలాగే , వ్యక్తిగత,కుటుంబ కలహాలే ప్రాణం తీశాయా అనే దానిపై కూడా పోలీసులు ఫోకస్ పెట్టారు.

అయితే , దర్యాప్తు చేపట్టిన కొద్దిసేపటికే పోలీసులు ఈ కేసులో పురోగతి సాధించారు. ఈ ఘటనకి ముందు అసలేం జరిగింది..? ఈ ఘటన జరగడానికి అసలు కారణాలేంటి..? అనే వివరాలను ఏసీపీ శివకుమార్ మీడియాకు వెల్లడించారు. ‘ఆత్మహత్య చేసుకున్న ఇద్దరు యువతులు సుమతి, రేవతిగా గుర్తించాం. సుమతి, రేవతి.. ఇద్దరూ ఫ్రెండ్స్. రేషన్‌ బియ్యం కోసం వెళ్లి ఇంటికి ఆలస్యంగా రావడంతో భర్తలు మందలించారు. మనస్తాపం చెంది రెండు రోజుల కిందట జవహర్‌నగర్‌ కు వచ్చేశారు. రెండు రోజులుగా చర్చిలోనే ఉన్నారు.. రాత్రి 11 గంటల ప్రాంతంలో ఆత్మహత్య చేసుకున్నారు. సుమతికి కూతురు ఉంది.. పేరు ఉమామహేశ్వరి. చిన్నారికి కూల్‌డ్రింక్‌ లో హార్పిక్‌, ఆలౌట్‌ కలిపి తాగించారు. చిన్నారి చనిపోయాక.. ఇద్దరూ చున్నీలతో చెట్లకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు’ అని శివకుమార్ మీడియాకు వివరించారు . కాగా.. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను గాంధీ ఆసుపత్రి మార్చురీకి పోలీసులు తరలించారు.