Begin typing your search above and press return to search.
ఫుడ్ ఇన్స్పెక్టర్స్ అంటూ మాయ చేస్తున్న ఆంటీలు..లక్షల్లో లూఠీ!
By: Tupaki Desk | 2 Oct 2020 5:23 PM GMTదేశంలో కరోనా మహమ్మారి వ్యాధి విలయతాండవం చేస్తోంది. ఇన్ని రోజులు శుభ్రత, పరిశుభ్రత పాటించని వాళ్లు కూడా ఇప్పుడు కరోనా వైరస్ దెబ్బకి భయంతో అన్నీపాటిస్తున్నారు. ప్రతిరోజు శానిటైజర్లు, సబ్బులతో చేతులు శుభ్రం చేసుకుని సామాజిక దూరం పాటిస్తూ ఎన్నడూ లేని ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇక నిన్న , మొన్నటి వరకు హోటల్, రెస్టారెంట్స్ లో బిర్యానీలు తిన్నా, భోజనం చేసినా ప్రిస్టేజ్ గా భావించే ప్రజలు నేడు కరోనా వైరస్ భయంతో బయట ఆహారం తీసుకోవాలన్నా వణికిపోతున్నారు.
రెస్టారెంట్లు, హోటల్స్ శుభ్రంగా పెట్టుకుని కస్టమర్లను ఆకర్షించడానికి వాటి యజమానులు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే హటల్స్ లో ఆహారం తినే ప్రజలు మాత్రం కరోనా భయంతో వెనుకా ముందు ఆలోచిస్తున్నారు. తమిళనాడులోని కోయంబత్తూరులో ఇద్దరు ఆంటీల తీరుతో రెస్టారెంట్స్, హోటల్స్ యజమానులు హడలిపోతున్నారు. కోయంబత్తూరులోని పులియంకులం ప్రాంతంలో రెస్టారెంట్స్, హోటల్స్ ఎక్కువగా ఉన్నాయి. పులియంకులం ప్రాంతంలో తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నై సిటీలో రిజిస్టర్ అయిన ఓ ఖరీదైన కారులో ఇద్దరు మహిళలు, వారి వెంట నలుగురు వ్యక్తులు వెళ్లారు. హోటల్స్ దగ్గర కారు నిలిపిన ఆ గ్యాంగ్ ఒక్కసారిగా ఓ రెస్టారెంట్ లోకి ఎంట్రీ ఇచ్చారు.
మేడమ్ లు ఇద్దరూ ఫుడ్ ఇన్స్ పెక్టర్స్. మీ హోటల్స్, రెస్టారెంట్స్, కిరాణా షాపులు పరిశీలించడానికి వచ్చారు అంటూ ఇద్దరు మహిళలు వెంట వెళ్లిన వ్యక్తులు నానా హంగామా చేశారు. అంతే హోటల్స్ లో వంట గదుల్లోకి వెళ్లిన ఇద్దరు మహిళలు ఏంటీ, మీరు శుభ్రత లేకుండా వంటలు చేస్తున్నారు , ఇవే ప్రజలకు వడ్డించి వారి ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారా అంటూ రెచ్చిపోయారు. ఇక లాభం లేదు వెంటనే మీ హోటల్స్, రెస్టారెంట్టస్ సీజ్ చెయ్యాల్సిందే అంటూ టిప్పుటాప్ లో వెళ్లిన ఇద్దరు మహిళలు నానా రచ్చ చేశారు.
ఓ మహిళ కోయంబత్తూరులో ఎంతో పేరు ఉన్న విఘ్నేష్ అనే ఫేమస్ హోటల్ యజమానిని బెదిరించి లక్ష రూపాయలు ఇవ్వాలని, లేదంటే మీ హోటల్ సీజ్ చేస్తామని బెదిరించింది. మరో మహిళ ఓ రెస్టారెంట్ యజమానిని బెదిరించి అక్కడ ఉన్న వంటకాలు శుభ్రంగా లేవని పట్టుకుని చూసి రెండు లక్షల రూపాయలు ఇవ్వాలని బెదిరించింది. ఇలా ఇద్దరు మహిళలు దొరికిన కాడికి దోచేస్తున్నారు.
హోటల్స్, రెస్టారెంట్స్ టార్గెట్ పూర్తి అయిన తరువాత ఈ గ్యాంగ్ పెద్దపెద్ద కిరాణా షాపుల మీద పడి తూకాలు సక్రమంగా లేవని, నాణ్యమైన సరులు లేవని వాటి యజమానులను భయభ్రాంతులకు గురి చేశారు. నకిలీ ఫుడ్ ఇన్స్ పెక్టర్స్ కోయంబత్తూరులో ఆంటీల దెబ్బకు హడలిపోయిన వ్యాపారులు కోయంబత్తూరు జిల్లా ట్రేడర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడికి ఫోన్ చేసి విషయం చెప్పారు. ట్రేడర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు ఆరా తియ్యగా వచ్చిన ఆంటీలు అసలైన ఫుడ్ ఇన్స్ పెక్టర్లు కాదని వెలుగు చూడటంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పటికే చిక్కినకాటికి చిక్కినట్లు లూటీ చేసిన నకిలీ ఫుడ్ ఇన్స్ పెక్టర్లు కోయంబత్తూరు నుంచి మాయం అయ్యారు . కిలాడీ లేడీలతో పాటు ఆహార భద్రత శాఖ నకిలీ అధికారులను పట్టుకోవడానికి తమిళనాడు పోలీసులు రంగంలోకి దిగారు.