Begin typing your search above and press return to search.

పురుష పోలీస్ ను కిడ్నాప్ చేసిన ఇద్దరు మహిళా పోలీసులు.. కేసు నమోదు

By:  Tupaki Desk   |   6 Dec 2022 1:30 AM GMT
పురుష పోలీస్ ను కిడ్నాప్ చేసిన ఇద్దరు మహిళా పోలీసులు.. కేసు నమోదు
X
ట్రైయిన్ రివర్స్ కావడం అంటే ఇదే. సమాజంలో ఆడవాళ్లకు రక్షణ లేదని గొంతెత్తే రోజులు పోయాయి. ఇప్పుడు ఆడవాళ్ల చేతిలో మగాళ్లే బాధితులుగా మారుతున్న రోజులు వచ్చాయి. తాజాగా ఒక మగ పోలీసును ఇద్దరు మహిళా పోలీసులు కిడ్నాప్ చేసిన వైనం విస్తుగొలుపుతోంది.

న్యాయస్థానం ఆదేశాల మేరకు ఉత్తరప్రదేశ్‌లోని సుల్తాన్‌పూర్‌లోని మహిళా ఠాణాలో నియమించబడిన ఒక పోలీసు ఇన్‌స్పెక్టర్ ను ఇద్దరు మహిళా కానిస్టేబుల్ లు జులైలో కిడ్నాప్ చేశారు. ఇటీవల ఓ మహిళా కానిస్టేబుల్ పై అత్యాచారానికి పాల్పడ్డాడని ఆరోపణలు ఎదుర్కొన్న ఓ పురుష పోలీసు ఇన్‌స్పెక్టర్‌ ను వీరు కిడ్నాప్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి.

ఇన్‌స్పెక్టర్ నిషు తోమర్‌పై అత్యాచార ఆరోపణల కింద కేసు నమోదు చేసి సస్పెండ్ చేయబడ్డాడు.  సుల్తాన్‌పూర్‌లోని స్థానిక కోర్టులో లొంగిపోవడానికి వెళ్ళాడు.అనంతరం సెప్టెంబర్ 22న మహిళా ఠాణా ఎస్‌హెచ్‌ఓ మీరా కుష్వాహా ఈ మగ పోలీసులను అరెస్టు చేశారు.

అప్పటి నుంచి అతడు కనిపించకుండా పోయాడు. ఈ వ్యవహారంపై చర్యలు తీసుకోవాలని తోమర్ భార్య కోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆదేశాల మేరకు మహిళా ఇన్‌స్పెక్టర్‌, కానిస్టేబుల్‌పై కేసు నమోదు చేశారు.

కోర్టు ఆదేశం మేరకు, ఒక వ్యక్తిని కిడ్నాప్ చేయడం లేదా నిర్బంధంలో ఉంచడం.. నేరపూరిత కుట్ర (120-B)తో పాటు చంపేస్తానని బెదిరించడం (364) కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు సుల్తాన్‌పూర్ పోలీస్ సూపరింటెండెంట్ సోమెన్ బర్మా తెలిపారు. మీరా కుష్వాహాపై ఐపీసీ కేసు నమోదైంది. "మేము ఐదు బృందాలను ఏర్పాటు చేసాము. పురుష పోలీస్ తోమర్ జాడ కోసం ప్రయత్నాలు కొనసాగుతున్నాయి" అని ఉన్నతాధికారి చెప్పాడు.

జులైలో తన భర్తపై అత్యాచారం కేసు పెట్టి ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారని తోమర్ భార్య కుసుమ్ దేవి తెలిపారు. "దర్యాప్తు స్టేషన్ హౌస్ ఆఫీసర్ మహిళా ఠాణా మీరా కుష్వాహకు బదిలీ చేయబడింది. సెప్టెంబర్ 22 న, అదే కేసులో, ఆమె భర్త లొంగిపోవడానికి స్థానిక కోర్టుకు చేరుకున్నాడు. ఆ టైంలో కక్ష పెంచుకున్న మీరా మరో మహిళా పోలీస్ తో కలిసి ఆ మగ పోలీస్ ను కిడ్నాప్ చేసినట్టు సమాచారం.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.